యూట్యూబర్ హర్ష సాయి పైన ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం కలకలం సృష్టించింది. యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన హర్ష సాయి పై ఈ మధ్యన మరో యూట్యూబర్ యువసామ్రాట్ సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. హర్ష సాయి డబ్బు కోసం గేమింగ్ యాప్స్ ని, బెట్టింగ్స్ యాప్స్ ని ప్రమోట్ చేస్తాడు అంటూ అతని బండారాన్ని బయటపెట్టాడు.
తాజాగా హర్ష సాయి పై మరో అలిగేషన్ వినిపిస్తోంది. హర్ష సాయి తనని ప్రేమించి మోసం చేసాడు అంటూ ఓ యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ లోకి వెళ్లి ఫేమస్ అయిన ఆ యువతి తనను హర్ష సాయి ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది.
అంతేకాకుండా హర్ష సాయి తన దగ్గర నుంచి రెండు కోట్ల రూపాయల వరకు తీసుకొని మోసం చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు ఆ యువతి స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేసుకున్నారు.