Advertisementt

అలియా భట్ నోట దేవర చుట్టమల్లే పాట

Tue 24th Sep 2024 06:49 PM
alia bhatt  అలియా భట్ నోట దేవర చుట్టమల్లే పాట
Alia Bhatt surprises with Devara song అలియా భట్ నోట దేవర చుట్టమల్లే పాట
Advertisement
Ads by CJ

దేవర లో యంగ్ టైగర్ ఎన్టీఆర్-బ్యూటిఫుల్ హీరోయిన్ జాన్వీ కపూర్ ల చుట్టమల్లే సాంగ్ ఎంతగా ట్రెండ్ అయ్యిందో అందరికి తెలిసిందే. చుట్టమల్లే పాటలో ఎన్టీఆర్ ఆటకు జాన్వీ కపూర్ స్టెప్స్ అద్భుతః అన్న రేంజ్ లో ఉండడమే కాదు.. ఎన్టీఆర్ డాన్స్ కు మించి జాన్వీ కపూర్ అందాలు ఆ పాటలో హైలెట్ అయ్యాయి. 

ఇప్పుడు ఈ చుట్టమల్లే పాటను బాలీవుడ్ క్యూటీ అలియా నోటి వెంట వినగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. మ్యూజిక్ లవర్స్ అంతా ఎగ్జైట్ అవుతున్నారు. బాలీవుడ్ లో ఎన్టీఆర్ వరుస ఇంటర్వ్యూల్లో భాగంగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఎన్టీఆర్, ఆలియా భట్ లతో ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. ఆలియా లీడ్ రోల్ లో జిగ్ర అనే హిందీ మూవీ తెరకెక్కింది. 

ఈ క్రమంలోనే దేవర ను హిందీలో రిలీజ్ చేస్తున్న కరణ్ జోహార్ దేవర, జిగ్ర సినిమాలకు కలిపి ఒకే ఇంటర్వ్యూలాగా ప్లాన్ చెయ్యగా తాజాగా ఆ ఇంటర్వ్యూ వదిలారు. ఇందులో ఆలియా భట్ దేవర సినిమాలోని చుట్టమల్లే సాంగ్ ను తెలుగులో అద్భుతంగా పాడి అదరగొట్టింది. దేవర లో ఇది తన ఫేవరెట్ సాంగ్ అంటూ అలియా భట్ ఆ పాటను క్యూట్ గా పాడింది. 

దాంతో ఎన్టీఆర్ సైతం ఫిదా అయ్యారు. ఎన్టీఆర్ మాత్రమే కాదు ఆలియా సింగింగ్ సూపర్ అని, తెలుగులో అద్భుతంగా పాడింది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

Alia Bhatt surprises with Devara song:

 Alia Bhatt Teases With Devara Song

Tags:   ALIA BHATT
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ