Advertisementt

నామినేషన్స్ తర్వాత కూడా యష్మి vs సోనియా

Tue 24th Sep 2024 04:09 PM
yashmi  నామినేషన్స్ తర్వాత కూడా యష్మి vs సోనియా
Yashmi vs Sonia even after nominations నామినేషన్స్ తర్వాత కూడా యష్మి vs సోనియా
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 8లో నాలుగో వారం నామినేషన్స్ హీట్ హౌస్ ని వదిలి పోలేదు. సోషల్ మీడియా vs సీరియల్ స్టార్స్ మధ్యలో నామినేషన్స్ విషయంలో పెద్ద యుద్ధమే నడుస్తుంది. గత మూడు వారాల్లో బెజవాడ బేబక్క, శేఖర్ భాషా, అభయ్ లు ఎలిమినేట్ అయ్యారు. ఇక నాలుగో వారానికి గాను ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. అందులో పృథ్వీ, సోనియా, నబీల్, ఆదిత్య ఓమ్, నాగమణికంఠ, ప్రేరణ లు నామినేషన్స్ లో ఉన్నారు.

నైనికా కూడా ఈ వారం నామినేషన్స్ లో ఉండగా.. క్లాన్ చీఫ్ నిఖిల్ ని నామినేషన్స్ లో ఉన్న ఒకరిని సేవ్ చెయ్యాలంటే నైనికా నామినేషన్ సిల్లీ అంటూ నైనికను నిఖిల్ సేవ్ చేసాడు. అయితే ఈ నామినేషన్స్ లో యష్మి తన క్లాన్ లో ఉండగా సోనియా ఎవ్వరికి ఇంపోర్టన్స్ ఇవ్వలేదు, కానీ నిఖిల్ క్లాన్ లోకి వెళ్ళాక ఆమె నిఖిల్ కి ఇంపార్టన్స్ ఇస్తుంది.

అంతేకాదు నువ్వు పృథ్వీ, నిఖిల్ ని ముందు పెట్టి గేమ్ ఆడుతున్నావ్ నీ సోలో గేమ్ చూడాలని ఉంది అని నామినేట్ చెయ్యగా.. సోనియా గట్టిగానే డిఫెండ్ చేసుకుంది. ఇక నామినేషన్స్ అయ్యాక కూడా యష్మి, సోనియా మధ్యలో గొడవ చల్లారలేదు. సోనియా యష్మితో నన్ను చీప్ గా మాట్లాడుతున్నావ్ నిఖిల్, పృథ్వీ నాకు మధ్యలో ఏమి లేదు సిస్టర్ బంధం అని యష్మి తో గొడవ పెట్టుకుంది.

యష్మి కూడా నువ్వు వాళ్ళను సిస్టర్, మధర్ అంటూ ఇష్టం వచ్చినట్టుగా యూస్ చేసుకుంటున్నావు, వారిని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు, వాళ్ళను నీ చుట్టూ తిప్పుకుంటున్నావ్ అంది. సోనియా కూడా పెద్ద గొడవే చేసింది. ఆ తర్వాత యష్మి ఈ ఇష్యు పై వెక్కి వెక్కి ఏడ్చినా ప్రోమో వైరల్ అయ్యింది.

Yashmi vs Sonia even after nominations:

Bigg bOss 8: Yashmi vs Sonia

Tags:   YASHMI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ