Advertisementt

నామినేటెడ్ పదవుల్లో సామాన్య కార్యకర్తకు పెద్దపీట

Tue 24th Sep 2024 02:17 PM
nominated posts  నామినేటెడ్ పదవుల్లో సామాన్య కార్యకర్తకు పెద్దపీట
Common worker is given priority in nominated posts నామినేటెడ్ పదవుల్లో సామాన్య కార్యకర్తకు పెద్దపీట
Advertisement

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచిన తర్వాత.. యావత్ రాష్ట్రం అంతా వేచి చూసింది నామినేటెడ్ పదవుల కోసమే. కాస్త ఆలస్యం అయినా రాష్ట్ర రాజకీయాలు వాడివేడిగా నడుస్తున్న పరిస్థితుల్లో.. 99 మందితో మొదటి నామినేటెడ్ పదవుల జాబితాను కూటమి ప్రభుత్వం ప్రకటించినది. ఇందులో టీడీపీకి 16, జనసేనకు 03, బీజేపీకి 01 నామినేటెడ్‌ పోస్టులు దక్కాయి.

ఎవరెవరికి..?

ఇందులో.. బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీలకు పెద్ద పీట వేసింది. 11 మంది క్లస్టర్ ఇంఛార్జీలకు పదవులు దక్కాయి. ఒక క్లస్టర్ ఇంఛార్జికి ఛైర్మెన్ పదవి.. ఆరుగురు యూనిట్ ఇంఛార్జీకు కీలక పదవులు.

దక్కడం విశేషం అని చెప్పుకోవచ్చు. మొత్తం.. 20 కార్పొరేషన్లుకు ఛైర్మెన్లు, ఒక కార్పొరేషన్ కు వైస్ ఛైర్మెన్, వివిధ కార్పొరేషన్లు సభ్యులను కూటమి ప్రభుత్వం ప్రకటించినది. ప్రకటించిన 99 పదవుల్లో యువతకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా.. పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు సీఎం చంద్రబాబు పదవులు కట్టబెట్టడం సంతోషకరం.

ఇదిగో వీరే..!

ఆర్టీసీ ఛైర్మన్‌ : కొనకళ్ల నారాయణ

ఏపీఐఐసీ చైర్మన్ : మంతెన రామరాజు

20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్‌  : లంకా దినకర్

శాప్ ఛైర్మన్‌ :  రవినాయుడు

వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్‌ :  అబ్దుల్ అజీజ్

హౌసింగ్ బోర్డ్ ఛైర్మన్‌ :  తాతయ్యనాయుడు

ట్రైకార్ ఛైర్మన్‌ : శ్రీనివాసులు

మారిటైమ్ బోర్డ్ ఛైర్మన్‌ :  దామచర్ల సత్య

సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ : సుబ్బారెడ్డి

సీడ్‌ ఏపీ ఛైర్మన్‌ : దీపక్‌రెడ్డి

మార్క్‌ఫెడ్‌ ఛైర్మన్‌ :  బంగార్రాజు

ఏపీఐఐసీ ఛైర్మన్‌ : రామరాజు

పద్మశాలి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ : అబద్ధయ్య

ఏపీ టూరిజం డెవపల్‌మెంట్‌ కార్పొరేషన్‌ : బాలాజీ

ఏపీ అర్బన్‌ ఫైనాన్స్ : గోవింద సత్యనారాయణ

లెదర్ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ : మాణిక్యాలరావు

ఏపీ స్టేట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్‌ : పీతల సుజాత

ఏపీ ఎంఎస్‌ఎంఈ డీసీ : తమ్మిరెడ్డి శివశంకర్

సివిల్‌ సప్లైస్ కార్పొరేషన్‌ ; సీతారామ సుధీర్

ఏపీ ట్రేడ్‌ ప్రొమోషన్‌ కార్పొరేషన్‌ : బాబూరావు

ఏపీ టిడ్కో : అజయ్‌కుమార్‌ లతో పాటు పలువురు ముక్త్య కార్యకర్తలు, మాజీలకు పదవులు దక్కాయి.

Common worker is given priority in nominated posts:

The coalition government announced the first list of nominated posts

Tags:   NOMINATED POSTS
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement