Advertisementt

ఆస్తి మొత్తం భార్యకి.. ఉత్తి చేతులతో హీరో

Tue 24th Sep 2024 12:54 PM
jayam ravi  ఆస్తి మొత్తం భార్యకి.. ఉత్తి చేతులతో హీరో
Jayam Ravi who gave clarity on the matter of property ఆస్తి మొత్తం భార్యకి.. ఉత్తి చేతులతో హీరో
Advertisement
Ads by CJ

ఏ కపుల్ అయినా విడాకులు తీసుకుంటే భర్తలు భార్యకి తగిన న్యాయం చేశాకే విడాకులు తీసుకునేలా చట్టంలోనే రాసి పెట్టారు. భార్యకు భరణం కింద భర్త తన ఆస్తిలో ఇంత అని ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో నాగ చైతన్య-సమంత, ధనుష్, ఐశ్వర్యలు విడాకుల సమయంలో సమంత చైతు దగ్గరనుంచి భరణం కింద బోలెడంత ఆస్తి తీసుకుంది, ధనుష్ భార్య కు విడాకులతోపాటు కోట్ల ఆస్తి ఇచ్చాడు అనే ప్రచారం జరిగింది. 

తాజాగా కోలీవుడ్ క్యూట్ కపుల్ గా చెప్పుకునే జయం రవి-ఆర్తి లు విడాకులు తీసుకోవడం వారి వారి అభిమానులకు షాకిచ్చింది. మరోపక్క జయం రవి విడాకుల ప్రకటన చెయ్యడం పై ఆర్తి సెన్సేషనల్ ట్వీట్ పెట్టింది. తనకు ఇన్ ఫార్మ్ చెయ్యకుండా డివోర్స్ అనౌన్సమెంట్ ఇవ్వడం పై జయం రవి పై ఆర్తి ఫైర్ అయ్యింది. 

కానీ జయం రవి మాత్రం నేను విడాకుల నోటీసులు పంపిన విషయం మా పేరెంట్స్ కి ఆర్తి పేరెంట్స్ కు, నాకొడుకు ఆర్నావ్ కు కూడా తెలుసు. నేను విడాకుల కోసం కోర్టులో న్యాయ పోరాటం చేస్తాను. నిజాలు బయటికి వచ్చినప్పుడు అపుడు చెబుతాను అంటూ జయం రవి చెప్పాడు. తాజాగా ఆర్తికి అన్యాయం చేసి ఆస్తి కూడా ఇవ్వకుండా జయం రవి ఓ సింగర్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడనే ప్రచారం జరుగుతుంది. 

ఆ విషయమై కూడా జయం రవి క్లారిటీ ఇచ్చేసాడు. తాను ఆస్తి మొత్తం భార్య, పిల్లకే వదిలేసి కట్టుబట్టలతో బయటికి వచ్చేసాను, నేను నా పిల్లల కస్టడీ కోరుతున్నాను, నా పిల్లలను నేనే పెంచుకుంటాను. నా దగ్గర నా అని చెప్పుకోవడానికి చిల్లిగవ్వ కూడా లేదు అంటూ జయం రవి ఆస్తిపై క్లారిటీ ఇచ్చాడు. 

Jayam Ravi who gave clarity on the matter of property:

Jayam Ravi gave the entire property to his wife Aarti

Tags:   JAYAM RAVI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ