Advertisementt

అల్లు అర్జున్ కు దేవర కథకు సంబంధం లేదు

Tue 24th Sep 2024 11:32 AM
allu arjun  అల్లు అర్జున్ కు దేవర కథకు సంబంధం లేదు
Koratala Siva about making Devara in Two Parts అల్లు అర్జున్ కు దేవర కథకు సంబంధం లేదు
Advertisement
Ads by CJ

ఆచార్య తర్వాత కొరటాల శివ అల్లు అర్జున్ తో సినిమా చెయ్యాల్సి ఉంది. ఆచార్య విడుదలకు ముందే కొరటాల శివ తో అల్లు అర్జున్ మూవీ పై అనౌన్సమెంట్ వచ్చింది. ఆచార్య రిజల్ట్ తర్వాత కొరటాల శివ - అల్లు అర్జున్ మూవీ ఆగిపోయింది. ఆతర్వాత కొరటాలకు ఎన్టీఆర్ భరోసా ఇవ్వడంతో దేవర రెండు పార్టులుగా పట్టాలెక్కింది. 

అప్పటి నుంచి కొరటాల శివ అల్లు అర్జున్ కు చెప్పిన కథతోనే ఎన్టీఆర్ తో దేవర సినిమా చేసాడనే ప్రచారం జోరుగా జరిగింది. అల్లు అర్జున్-కొరటాల కాంబో అనౌన్సమెంట్ వచ్చినప్పుడు ఓ పోస్టర్ వదిలారు. అది కూడా దేవర మాదిరి సముద్రపు అలల నడుమ ఉండడంతో దేవర కథ, అల్లు అర్జున్ కి చెప్పిన కథే ఒకటే అనుకుంటున్నారు ఆందరూ. 

తాజాగా కొరటాల దేవర ప్రమోషన్స్ లో భాగంగా ఈ రోజు హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా మీట్ లో అల్లు అర్జున్ కు చెప్పిన కథ వేరు, దేవర కథ వేరు అని పూర్తి క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ఆచార్య తర్వాత తనకు చిరంజీవి గారికి మద్యన మంచి సంబంధాలే ఉన్నాయి. మా మధ్యన ఎలాంటి క్లాషెస్ లెవు అని రూమర్స్ కి చెక్ పెట్టే ప్రయత్నమైతే కొరటాల దేవర మీడియా మీట్ లో చేశారు. 

Koratala Siva about making Devara in Two Parts:

Allu Arjun story has nothing to do with Devara story

Tags:   ALLU ARJUN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ