Advertisementt

ప్రకాష్ రాజ్, పొన్నవోలుకు పవన్ వార్నింగ్!!

Tue 24th Sep 2024 11:26 AM
pawan kalyan  ప్రకాష్ రాజ్, పొన్నవోలుకు పవన్ వార్నింగ్!!
Pawan Kalyan Warning to Prakash Raj and Ponnavolu ప్రకాష్ రాజ్, పొన్నవోలుకు పవన్ వార్నింగ్!!
Advertisement
Ads by CJ

ప్రకాష్ రాజ్, పొన్నవోలుకు పిచ్చి పట్టిందా.. పవన్ ఫైర్!

తిరుమల లడ్డు వివాదంపై సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకూ ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. ఇంత దారుణమా..? అంటూ కన్నెర్రజేస్తూ తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఐతే.. కొందరు మాత్రం చిత్ర విచిత్రంగా మాట్లాడిన పరిస్థితి. ఇందులో ప్రముఖ నటులు ప్రకాష్ రాజ్, కార్తీ ఉన్నారు. ఈ ఇద్దరి వ్యవహారంపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. మంగళవారం నాడు ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో శుద్ధి కార్యక్రమం చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్.. వెంకన్న లడ్డూపై వెటకారంగా మాట్లాడిన వారికి గట్టిగా ఇచ్చి పడేసారు.

మీకేంటి సంబంధం..?

లడ్డూ గురుంచి పవన్ ట్వీట్ చేయగా రిప్లై ఇచ్చిన ప్రకాష్ రాజ్ వెటకారంగా బీజేపీ మెప్పు కోసమే ఇదంతా చేస్తున్నారని.. అసలు ఇదంతా జాతీయ అంశమా..? అన్నట్టుగా ట్వీట్ లో రాసుకొచ్చారు. దీనిపై హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించగా ఇద్దరి ట్వీట్ వార్ నడిచింది కూడా. దీనిపై పవన్ ఘాటుగా స్పంచించారు. హిందువుల మనోభావాలను అపహాస్యం చేయొద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దేశంలోని హిందువులకు సాటి మతాలపై ద్వేషం ఉండదని అన్నారు. ఈ అంశంలో మీకేంటి సంబంధం..? మీరంటే గౌరవం ఉందన్నారు. సున్నితాంశాలపై ఏం జరిగింది..? ఏమిటి..? అనేది తెలుసుకుని మాట్లాడాలని ఒకింత హెచ్చరించారు. అపవిత్రం జరిగినా.. దేవతా విగ్రహాలను శిరోచ్చేధనం జరిగినా మాట్లాడకూడదా.. ఏం పిచ్చి పట్టింది మీకు..? అంటూ పవన్ మండిపడ్డారు. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు.. ఎవరూ దీని జోలికి రావద్దు అని విమర్శకులు అందరికీ గట్టిగానే ఇచ్చేశారు పవన్.

అంత పొగరా..?

ఇదే మీడియా మీట్ వేదికగా.. వైసీపీ నేతలతో పాటు, మాజీ అడిషినల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై పవన్ కన్నెర్ర చేశారు. తనపై విమర్శలు కాదు అపవిత్రం జరిగిందని తెలిసినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి..? మీకు  బాధ్యత లేదా? అని సూటి ప్రశ్నలు సంధించారు. ఈ సున్నిత పొన్నవోలు వ్యాఖ్యలు బాధపెట్టాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు పొగరుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తప్పు జరిగితే ఒప్పుకోండి.. లేకపోతే సంబంధం లేదని చెప్పండి అంతే కానీ ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు.

కార్తీ ఏమన్నాడు..?

ఇదిలా ఉంటే.. సత్యం సుందరం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో లడ్డూపై హీరో కార్తి మాట్లాడిన మాటలకు సైతం పవన్ రియాక్ట్ అయ్యారు. లడ్డూ మీద జోక్స్ వేస్తున్నారు. లడ్డూ అనేది సెన్సిటివ్ ఇష్యూ అని ఓ హీరో అన్నారు. మళ్లీ ఇంకోసారి అలా అనొద్దు. నటుడిగా మీరంటే నాకెంతో గౌరవం. సనాతన ధర్మాన్ని గౌరవించండి. ఏదైనా మాట్లాడే ముందు వందసార్లు ఆలోచించండని సూచించారు. కార్తీ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా పవన్ మాట్లాడారు. కాగా.. లడ్డూ కావాలా నాయనా అనే మీమ్ పై టాపిక్ వచ్చింది. ఇప్పుడు లడ్డూ గురించి వద్దని.. ఆ టాపిక్ చాలా సెన్సిటివ్ అని నవ్వుతూ స్పందించకుండా దాటవేశారు. అందుకే.. గత కొన్ని రోజులుగా ఎవరెవరు ఐతే ఇష్టానుసారం మాట్లాడారో వాళ్ళందరికీ పవన్ ఒక్కసారిగా ఇచ్చిపడేశారు.

Pawan Kalyan Warning to Prakash Raj and Ponnavolu:

Dy Pawan Kalyan Serious Warning To Prakash Raj

Tags:   PAWAN KALYAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ