పవన్ కళ్యాణ్ రెస్యూమ్ షూటింగ్ కోసం రెడీ అయ్యారు. సెప్టెంబర్ 23 నుంచి పవన్ కళ్యాణ్ మళ్ళీ సెట్స్ లోకి అడుగుపెట్టారు. అయితే పవన్ కళ్యాణ్ ముందు నుంచి సుజిత్ దర్శకత్వంలో OG కంప్లీట్ చేస్తారని అనుకున్నారు, అన్నారు. అందుకే మేకర్స్ OG ని మార్చ్ లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.
కానీ ఇక్కడ హరి హర వీరమల్లు మేకర్స్ ట్విస్ట్ ఇచ్చారు, కాదు కాదు పవన్ కళ్యాణ్ ట్విస్ట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ముందుగా OG కాదు వీరమల్లు పూర్తి చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మేకర్స్ హరి హర వీరమల్లు ను మార్చ్ లో విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. మరి వీరమల్లు మార్చి లో వస్తే OG వచ్చే అవకాశం లేదు.
అందుకే హరి హర వీరమల్లు ముందుకు, OG వెనక్కి అనేది. వీరమల్లు సెట్స్ మీదకి వెళ్లడంతో సుజిత్ కూడా తన మ్యూజిక్ డైరెక్టర్ థమన్, సింగర్ హీరో శింబుతో చెన్నైలో మ్యూజిక్ సిట్టింగ్స్ వేస్తున్నాడు. పవన్ నుంచి భరోసా రాగానే OG మేకర్స్ కూడా షూటింగ్ ప్లాన్ చేసుకుని పవన్ రాగానే వారు కూడా రిలీజ్ డేట్ లాక్ చేసేలా ఉన్నారు. అది వీరమల్లు కన్నా ముందు ఉంటుందా, లేదంటే వీరమల్లు తర్వాత ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.