ప్రాజెక్ట్ K అంటూ మొదటి నుంచి నాగ్ అశ్విన్ కల్కి చిత్రం పై పెంచిన క్రేజ్ మాములుగా లేదు. ప్రాజెక్ట్ K కాస్తా కల్కి 2898 AD కి మారింది. కల్కి పార్ట్1 ను కల్కి 2898 AD గా జూన్ 27 న విడుదల చేసిన మేకర్స్ కల్కి 2 ని ఎప్పుడు రిలీజ్ చేస్తారో అనే క్యూరియాసిటీని అందరిలో కలిగించారు. తాజాగా కల్కి 2 టైటిల్ విషయంలో ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది.
ప్రభాస్ కర్ణుడిగా నార్త్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాడు. అందుకే కల్కి సీక్వెల్ కు కర్ణ 3102 బీసీ అనే టైటిల్‌ను ఖరారు చేస్తున్నారని ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. నార్త్ ఆడియన్స్ కోసమే ఈ టైటిల్ ను మేకర్స్ చూజ్ చేసుకుంటున్నారని తెలుస్తుంది. కల్కి1 ఎండింగ్ ను కూడా కర్ణుడు పాత్ర పై ముగించారు
కాబట్టి కల్కి సీక్వెల్ మొత్తం కర్ణ పాత్ర చుట్టూ తిరుగుతందనే అనుకోవాలి. అందుకే కల్కి సీక్వెల్ కు కర్ణ 3102 బీసీ అనే టైటిల్‌ను పెడుతున్నారేమో అనే ఆలోచనలో చాలామంది ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ కూడా రాజా సాబ్, హను రాఘవపూడి మూవీ తో పాటుగా స్పిరిట్ కూడా మొదలు పెట్టబోతున్నాడు. మరి అవి కంప్లీట్ అయ్యేవరకు కల్కి 2 మొదలవుతుందో లేదో క్లారిటీ లేదు.
నాగ్ అశ్విన్ కల్కి పార్ట్ 1 లో జరిగిన మిస్టేక్స్ కల్కి 2 లో రిపీట్ కాకుండా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రస్తుతం తలమునకలై ఉన్నాడట. కల్కి 2 ను కల్కి 1 కన్నా పెద్ద హిట్ చెయ్యాలనే కసితో నాగ్ అశ్విన్ వర్క్ చేస్తున్నాడట.