రీసెంట్ గా అభిమానుల రచ్చ, లెక్కకు మించి ఫ్యాన్స్ హాజరవడంతో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వాహకులు క్యాన్సిల్ చెయ్యాల్సి వచ్చింది. వర్షాలకు భయపడి, ప్రభుత్వ అనుమతులు రాక చిన్నపాటి కెపాసిటీ(6 వేల )ఉన్న నోవాటెల్ హోటల్ ను దేవర ఈవెంట్ కోసం మేకర్స్ బుక్ చెయ్యడం, ఎన్టీఆర్ ని ఆరేళ్ళ తర్వాత సోలో హీరోగా చూసేందుకు ఫ్యాన్స్ రెండు తెలుగు రాష్ట్రాల నలుమూల నుంచి హాజరవడంతో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ వద్ద గందరగోళం జరిగింది.
కేవలం అభిమానుల అత్యుత్సాహమే ఈవెంట్ క్యాన్సిల్ అవడానికి కారణం. తాజాగా పుష్ప నిర్మాతను మీరు దేవర ఈవెంట్ విషయంలో ఏమనుకుంటున్నారు, పుష్ప 2 ఈవెంట్స్ ను ఎలా ప్లాన్ చేస్తారని అడిగితే.. పుష్ప 2 నిర్మాత పుష్ప 2 ప్రమోషన్స్ వేరే లెవల్ లో ఉండబోతున్నాయి. పుష్ప 2 కి సంబంధించి ఏ ఈవెంట్ అయినా ఓపెన్ గ్రౌండ్ లోనే ప్లాన్ చేస్తాము.
దేవర విషయంలో అభిమానులు లెక్కకు మించి హాజరయ్యారు. పోలీసులు కూడా అభిమానులను అదుపు చేయలేకపోయారు. అభిమానులను కూడా ఏమి అనలేము. దేవర కు ఇప్పుడు మరో ఈవెంట్ చేసే పరిస్థితి కూడా రాలేదు, ఎన్టీఆర్ దేవర యుఎస్ ప్రమోషన్స్ కోసం వెళ్లిపోయారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని పుష్ప 2 విషయంలో పకడ్బందీ ఏర్పాటు చేస్తామని చెప్పారాయన.