రాజమౌళి-మహేష్ కాంబో ప్రాజెక్ట్ పై ఎప్పుడెప్పుడు అనౌన్సమెంట్ వస్తుందో అని మహేష్ అభిమానులు ఎదురు చూడని రోజు లేదు. సెప్టెంబర్ లో రాజమౌళి-మహేష్ SSRMB ప్రాజెక్ట్ పై ప్రకటన వస్తుంది అని నిర్మాత చెప్పినా.. సెప్టెంబర్ పూర్తి కావడానికి మరొక్క వారమే మిగిలిఉంది. మహేష్ కూడా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తూ రాజమౌళి సినిమా కోసం మేకోవర్ అవుతున్నారు.
ఇప్పటివరకు లుక్ విషయంలో పూర్తిగా ఎక్కడా రివీల్ చెయ్యకుండా క్యాప్ తో కవర్ చేస్తున్న మహేష్ ఇప్పుడు మాత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సమయంలో తన పూర్తి లుక్ రివీల్ చేసేసారు. లాంగ్ హెయిర్, పెరిగిన గెడ్డంతో మహేష్ బాబు కొత్త మేకోవర్ లో హాలీవుడ్ స్టార్ లా కనిపించేసరికి.. మహేష్ కొత్త లుక్ పరిచయం చేసారు, రాజమౌళి చిత్రంలో మహేష్ ఇలానే కనిపిస్తారంటూ మహేష్ అభిమానులు చాలా ఎగ్జైట్ అవుతున్నారు.
కానీ కొంతమంది మాత్రం మహేష్ లుక్ ను జీసస్ తో పోలుస్తున్నారు. జీసస్ లా మహేష్ లాంగ్ హెయిర్, ఆయన గెడ్డం కనిపిస్తుంది.. యేసయ్యా.. కరుణా మయుడు.. అంటూ మహేష్ న్యూ లుక్ ని జీసస్ పిక్ మాదిరి తయారు చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మహేష్ బాబు జీసస్ లా ఎలా ఉన్నాడో చూడండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.