జానీ మాస్టర్ లేడీ కొరియోగ్రాఫర్ ని మోసం చేసిన కేసులో ప్రస్తుతం చెంచల్ గూడా జైలులో ఉన్నాడు. అయితే జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ జనసేనలో కీలకంగా వ్యవరిస్తున్నాడు కాబట్టే అల్లు అర్జున్ ఆ లేడీ కొరియోగ్రాఫర్ తో ఇదంతా చేయించాడు, అంతేకాకుండా ఆమెకు తన సినిమాల అన్నిటీలో అవకాశాలు ఇస్తాను అని భరోసా ఇచ్చాడనే ప్రచారం సోషల్ మీడియాలో గట్టిగానే జరిగింది.
తాజాగా జానీ మాస్టర్ వ్యవహారంలో అల్లు అర్జున్ కి కానీ, సుకుమార్ కు కానీ ఎలాంటి సంబంధం లేదు అంటూ పుష్ప 2 నిర్మాత క్లారిటీ ఇచ్చారు. మత్తువదలరా సక్సెస్ సెలెబ్రేషన్స్ లో పాల్గొన్న పుష్ప 2 నిర్మాత జానీ మాస్టర్ వ్యవహారం అనేది వారిద్దరి పర్సనల్ విషయం. ఆ విషయమై స్పందించడం కరెక్ట్ కాదు. ఈ విషయంలో సుకుమార్ కు, అల్లు అర్జున్ కు సంబంధం లేదు.
పుష్ప 2 స్టార్ట్ అయినప్పుడు ఆమెను అఫీషియల్ గా డాన్స్ మాస్టర్ గా తీసుకున్నాము, ఆమె పుష్ప 2 లోని అన్ని సాంగ్స్ కి పని చేస్తుంది. పుష్ప 2లో ఇంకా రెండు సాంగ్స్ బాలన్స్ ఉన్నాయి. అవి అక్టోబర్ 15 తర్వాత ప్లాన్ చేస్తున్నాము, జానీ మాస్టర్ తో వర్క్ చేయాలనుకున్నాం. కానీ ఇప్పుడు ఇలా అయ్యింది. పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ ఉంది.
విషెస్ చెబితే స్పందించడం తప్ప మా హీరోకు ఏమి తెలియదు, అయినా మెయిన్ మీడియాలో ఎలాంటి వార్తలు రాలేదు. కానీ యూట్యూబ్ ఛానల్స్ లో కావాలని పనిగట్టుకుని తప్పుడు వార్తలు రాస్తున్నారు అంటూ పుష్ప 2 నిర్మాత అల్లు అర్జున్-జానీ విషయంలో పూర్తి క్లారిటీ ఇచ్చారు.