సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజు సోమవారం భార్య నమ్రతతో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి CM రిలీఫ్ ఫండ్ కి తాను ఎనౌన్స్ చేసిన 50 లక్షల చెక్ ను అందజేశారు. తెలంగాణ వరదల కారణముగా నష్టపోయిన వారిని ఆదుకునే సందర్భంలో టాలీవుడ్ హీరోలు ముందుకు రాగా అందులో మహేష్ ఏపీకి 50 లక్షలు, తెలంగాణకు 50 లక్షల సహాయాన్ని అనౌన్స్ చేసారు.
తెలంగాణకు ప్రకటించిన 50 లక్షల డొనేషన్ ను నేడు మహేష్ తన భార్య తో కలిసి వెళ్లి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కు అందజేసిన సమయంలో మహేష్ బాబు రాజమౌళి తో చెయ్యబోయే SSRMB మూవీ లుక్ రివీల్ అయ్యింది. లాంగ్ హెయిర్ తో మహేష్ కొత్తగా కనిపించారు.
లాంగ్ హెయిర్ మాత్రమే కాదు.. గెడ్డం తో డిఫ్రెంట్ మేకోవర్ లో మహేష్ కనిపించగానే మహేష్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు. రాజమౌళి త్వరలోనే మహేష్ బాబు ప్రాజెక్ట్ పై కాన్సెప్ట్ వీడియో తో అనౌన్స్ చెయ్యనున్నారు. దసరా ఫెస్టివల్ కి రాజమౌళి-మహేష్ మూవీ పూజా కార్యక్రమాలు జరగబోతున్నట్టుగా టాక్ వినబడుతుంది.