దేవర సినిమా విడుదల దగ్గర పడుతూ ఉండడంతో దేవర టీమ్ సినిమాను ప్రమోట్ చేసేందుకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. సెప్టెంబర్ 10 న ముంబై లో దేవర ట్రైలర్ లాంచ్ నుంచి నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరగాల్సిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు ఎన్టీఆర్ అండ్ జాన్వీ కపూర్, కొరటాల శివ పరుగులు పెడుతున్నారు.
అయితే హైదరాబాద్ నోవెటల్ లో జరగాల్సిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ సెక్యూరిటీ రీజన్స్ వలన క్యాన్సిల్ అయ్యింది. ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్, జాన్వీ కపూర్ లను లైవ్ లో చూసి సంతోషపడాలనుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరిక తీరలేదు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ లు ఈవెంట్ కు వచ్చేందుకు రెడీగా ఉన్న సమయంలో దేవర ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది.
దీనితో జాన్వీ కపూర్ ఈవెంట్ కి రావాల్సిన కాస్ట్యూమ్స్ తోనే ఓ వీడియో వదిలింది. దేవర ఈవెంట్ కొచ్చి మీ ప్రేమను పొందుదామనుకున్నాను, అమ్మ శ్రీదేవి కి లాగే నన్ను మీరు ఆదస్తారని ఆశిస్తున్నాను, జాన్వీ పాప అంటూ మీరు పిలుస్తుంటే చాలా హ్యాపీగా ఉంది, ఎన్టీఆర్ గారు, కొరటాల గారు నన్ను హీరోయిన్ గా చూజ్ చేసుకోవడం నా లక్కీ అంటూ తెలుగులో మాట్లాడుతూ వదిలిన వీడియో వైరల్ గా మారింది.
దేవర ఈవెంట్ లో హాఫ్ శారీ లో జాన్వీ కపూర్ సందడి చేయాలనుకుంది. చక్కటి అందంతో, అద్భుతమైన అవుట్ ఫిట్ లో జాన్వీ కపూర్ ట్రెడిషనల్ గా కనబడింది. ఈవెంట్ లో జాన్వీ కపూర్ ని చూద్దామనుకున్న అభిమానులు జస్ట్ ఈ ఫొటోస్ ను చూసి తృప్తి పడుతున్నారు.