Advertisementt

భార్య ప్రణతి తో కలిసి యుఎస్ కి ఎన్టీఆర్

Mon 23rd Sep 2024 10:48 AM
ntr  భార్య ప్రణతి తో కలిసి యుఎస్ కి ఎన్టీఆర్
NTR to US with his wife Pranathi భార్య ప్రణతి తో కలిసి యుఎస్ కి ఎన్టీఆర్
Advertisement
Ads by CJ

రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులని డిజ్ పాయింట్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇక హైదరాబాద్ లో దేవర ప్రమోషన్స్ లో పాల్గొనబోడు. కారణం ఆయన ఈరోజు ఉదయమే భార్య ప్రణతితో కలిసి యుఎస్ ఫ్లైట్ ఎక్కారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరగాల్సిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ సెక్యూరిటీ రీజన్స్ తో రద్దయ్యింది. 

దానితో అభిమానులకు సారి చెబుతూ ఎన్టీఆర్ ఓ వీడియో వదిలాడు. ఇక దేవర విడుదలకు మరో నాలుగు రోజుల సమయమే ఉంది. ఈ నాలుగు రోజుల్లో ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్ చెయ్యడానికి సమయం కూడా లేదు. కారణం ఆయన యుఎస్ లో జరగబోయే దేవర స్పెషల్ ప్రీమియర్ కోసం ఈరోజు ఉదయమే యుఎస్ బయలుదేరి వెళ్లారు. 

మళ్ళీ దేవర విడుదల తేదీ అంటే సెప్టెంబర్ 27 ఉదయం ఆయన యుఎస్ నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా డిజ్ పాయింట్ అవుతున్నారు. ఎన్టీఆర్ ని లైవ్ లో చూసే ఛాన్స్ కోల్పోయామని.. వాళ్ళు ఈవెంట్ మేనేజర్లు మీద, అలాగే ఓపెన్ గ్రౌండ్ కి ఈవెంట్ కి అనుమతి ఇవ్వని ప్రభుత్వంపై వారు మండిపడుతున్నారు. 

NTR to US with his wife Pranathi:

NTR Heads To US After Devara Promotions

Tags:   NTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ