Advertisement

హైడ్రా ఇదేం న్యాయం.. ఇంత దారుణమా!?

Mon 23rd Sep 2024 10:12 AM
hydra  హైడ్రా ఇదేం న్యాయం.. ఇంత దారుణమా!?
Hydra is this justice.. is it so bad? హైడ్రా ఇదేం న్యాయం.. ఇంత దారుణమా!?
Advertisement

హైడ్రా.. ఈ పేరు వినపడితే చాలు సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకూ హడలెత్తి పోతున్న పరిస్థితి. పాపం సామాన్యులు ఐతే నెత్తి నోరు బాదుకుంటున్నారు. జీవితాంతం రక్తం, చెమట చిందించి.. పైసా పైసా కూడబెట్టి.. ప్రాణం పెట్టి కట్టుకున్న ఇల్లు కూల్చడం అంటే.. వారిని చంపడమే..? అంటూ సామాన్యుడి కంట రక్తం కారుతోంది. ఆదివారం రోజున హైదరాబాద్ లోని కూకట్‌పల్లి, నల్ల చెరువు వద్ద నిర్మాణాలు చేపట్టిన వాటిని హైడ్రా కూల్చేసింది. దీంతో బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. ఎటువంటి నోటీసు లేకుండా కూల్చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కనీసం సామాన్లు కూడా తీసుకొనివ్వకుండా కూల్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇంత దారుణమా..?

ఆదివారం నాడు జరిగిన కూల్చివేతలలో హృదయ విదారక దృశ్యాలే దర్శనం ఇచ్చాయి. నోటికి వచ్చినట్టు ఇంటి యజమానిని తిట్టి గర్భవతికి ఇల్లు ఖాళీ చేసే టైం ఇవ్వకపోవడం గమనార్హం. పాపం.. తన పిల్లలను ఎక్కడికి తీసుకొని పోవాలని ఆయన పడే నరకయాతన ఆ దు:ఖం మాటల్లో చెప్పలేం.. రాతల్లో రాయలేం. అసలు నోటీసులు లేవు, కోర్టు ఆదేశాలు లెక్క చేయకుండా హైడ్రా ఇంత దారుణంగా ప్రవర్తించడం ఏంటి..?. అయినా అనుమతులు ఇచ్చేది సర్కార్ అధికారులే.. పట్టాలిచ్చేది కూడా సర్కారే అలాంటప్పుడు వాళ్ళను దోషులుగా చేసి తాట తీయాల్సింది పోయి ప్రజల ఇళ్ళు కూల్చి ఏం సాధించినట్టు..?. రాజకీయ నాయకులు, అధికారులు, వ్యాపారులు చేసే తప్పులకు ప్రజల్ని శిక్షించడం ఏంటి ఇదేం న్యాయం..?. అందుకే.. ఇప్పుడు బాధ పడితే ప్రయోజనం ఏంటి..? ఓటేసేటప్పుడు ఆలోచించి ఉండా ల్సింది.. వచ్చే ఎన్నికల్లోనైనా ఆలోచించండి అని మేధావులు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి.

సమాధానాలు చెప్పండి సారూ..!

హైడ్రా కమీషనర్ రంగనాథ్ ను సామాన్యుడు మొదలుకొని సెలబ్రిటీలు, రాజకీయ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి అంటూ గట్టిగానే సంధిస్తున్నారు.

- హైడ్రా ప్రత్యేకంగా ఆదివారం.. నాడే ఎందుకు కూల్చివేతలు ప్రారంభిస్తుంది..?

- హైడ్రా న్యాయస్థానాల తీర్పును ఎందుకు పక్కన పెడుతోంది డుతుంది..?

- N కన్వెన్షన్ హాల్ కూల్చివేతపై హైకోర్టు స్టే ఇచ్చినప్పుడు.. ఎందుకు హైడ్రా కమిషనర్ స్టేకు గల కారణాలను మీడియా ముందుకు వచ్చి వివరించలేదు..?

- నిజంగానే ఒకవేళ కోర్టు స్టే ఇచ్చింది.. ఆ తరువాత హైడ్రా ఆ కూల్చివేత భవనంపై తీసుకునే తదుపరి చర్యలు ఏమిటి..?

-  కోర్టుల నుంచి స్టే వచ్చాక.. కూల్చివేతలు కొనసాగిస్తారా..?

లేక కూల్చివేతలు ఆపుతారా..? అప్పటివరకు జరిగిన ఆస్తి నష్టాన్ని లెక్కించి బాధితులకు నష్టపరిహారం ప్రభుత్వం తరపున ఇస్తారా..లేదా హైడ్రా కమిషనర్ ఆ ఖర్చును భరిస్తాడా..?

- వీటన్నింటికి ఖచ్చితంగా హైడ్రా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది..?

- సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటిని.. ఆదివారం కూల్చకుండా ప్రత్యేకంగా ఎందుకు నోటీసులు ఇచ్చారు..?నోటీసుల అర్ధం ఏమిటి..? తప్పు చేసారు..? తప్పించుకోమని సలహా ఇస్తున్నారా..?

- అనుమతులు ఇచ్చిన అధికారులపై ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలేమిటి..?

- కాంగ్రెస్ మంత్రుల ఫాంహౌసులు FTL , బఫర్ జోన్ లో ఉన్నాయని ఋజువులు ఉన్నా.. ఇప్పటివరకూ హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు..?

- అసలు హైడ్రాకు ఉన్న చట్టబద్దత ఏంటి..?

- పేదవారి, మధ్య తరగతి, కష్టార్జితాన్ని ఎందుకు నేలపాలు చేస్తున్నారు..? వారి ఆశల సామ్రాజ్యాన్ని ఎందుకు కూల్చివేస్తున్నారు..?

- వారి కుటుంబాన్ని, వారి పిల్లలను ఎందుకు అనాథలా రోడ్డు మీదకు ఈడుస్తున్నారు.. ఎందుకు గుండెలు విలపించి రోధించేలా ప్రవర్తిస్తున్నారు..? అని ప్రతిపక్ష బీఆర్ఎస్, మేధావులు ప్రశ్నిస్తున్న పరిస్థితి.

Hydra is this justice.. is it so bad?:

Hydra demolished the constructions at Kukatpally and Nalla Cheruvu in Hyderabad 

Tags:   HYDRA
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement