దేవర ఈవెంట్ కోసం ఎన్నో ఆశలు పెట్టుకుని హైదరాబాద్ నోవెటల్ కి పరిగెత్తిన ఎన్టీఆర్ అభిమానులను నిరాశపరుస్తూ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని క్యాన్సిల్ చేశారు నిర్వాహకులు. అంచనాలకు మించి దేవర ఈవెంట్ ప్లేస్ కి అభిమానులు చేరుకోవడంతో పోలీసులు, ఈవెంట్ నిర్వాహకులు వారిని అదుపు చెయ్యలేక చెతులెత్తెయ్యడమే కాదు అక్కడ జరిగిన ఘర్షణలో పోలీసులు లాఠీఛార్జ్ చెయ్యడంతో స్వల్ప ఉద్రిక్తత చేటు చేసుకుంది.
నోవెటల్ హోటల్ ఆడిటోరియం లోకి చొచ్చుకుపోయేందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అక్కడి అద్దాలను ధ్వంశం చెయ్యడంతో రచ్చ రచ్చ అయ్యింది. 6 వేలు కెపాసిటీ ఉన్న ఏరియా కు 20 వేలమంది రావడం, అక్కడ మొత్తం జాతరను తలపించడంతో ఈవెంట్ నిర్వాహకులు చేతులెత్తేశారు. ఈవెంట్ మొదలు కాకముందే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చెయ్యడంతో ఎన్టీఆర్ అభిమానులు డిజ్ పాయింట్ అయ్యారు.
దేవర ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో ఎన్టీఆర్ అభిమానుల కోసం ఓ వీడియో వదిలారు.
అభిమాన సోదరులకు నమస్కారం.. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ సెక్యూరిటీ రీజన్స్ వలన క్యాన్సిల్ కావడం బాధాకరం, దానికి మీకెంత బాధగా ఉందొ.. నాకు అంతకన్నా ఎక్కువగా బాధగా ఉంది. మీరు నన్ను చూసేందుకు, నేను మిమ్మల్ని కలుసుకునేందుకు ఆత్రంగా ఉన్న సమయంలో ఇలా జరగడం నిజంగా బాధాకరం. దేవరతో మేము పడిన కష్టం గురించి మీకు వివరిద్దామని నేను చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాను.
ఈ ఈవెంట్ క్యాన్సిల్ అవడానికి కారణం ప్రొడ్యూసర్స్ కానీ, ఈవెంట్ నిర్వాహకులు కానీ కాదు. వాళ్ళని బ్లేమ్ చెయ్యడం తప్పనేది నా ఫీలింగ్, మీరు కురిపించే ఈప్రేమకు ఆజన్మాంతం రుణపడి ఉంటాను, ఈరోజు మనం కలవకపోయినా సెప్టెంబర్ 27 న కలవబోతున్నాము, నేను ఎప్పుడూ చెప్పినట్టే మీరు కాలర్ ఎగరేసుకుని తిరిగేలా కష్టపడ్డాము, అదే జరగబోతుంది అని ఆసిస్తున్నాను.. అన్నిటికన్నా ముఖ్యం మీ ఆశీర్వాదం దేవరకు, నాకు ఏంతో అవసరం..
మీరందరూ జాగ్రత్తగా ఇంటికి తిరిగి వెళతారని మరోసారి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అంటూ అభిమానుల అహాన్ని ఎన్టీఆర్ చల్లబరిచే ప్రయత్నం చేసారు.