దేవర మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సెప్టెంబర్ 10 న వదిలిన ట్రైలర్ చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వచ్చాయి. దేవర యాక్షన్ చూసి ఫ్యాన్స్ కి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఎన్టీఆర్ డ్యూయెల్ కేరెక్టర్స్ అభిమానులు బాగా ఎంజాయ్ చేసారు. దేవర గా ఎన్టీఆర్ లుక్, భైర గా సైఫ్ అలీ ఖాన్ లుక్, ఇంకా ఎర్ర సముద్రం అంటూ కొరటాల పెంచిన హైప్ అన్ని ఫస్ట్ ట్రైలర్ లోనే చూపించారు.
ఇప్పుడు దేవర పై మరిన్ని అంచనాలు పెంచేందుకు మేకర్స్ మరో ట్రయిలర్ ని వదిలారు. ఈ ట్రయిలర్ ఎమన్నా కొత్తగా ఉంటుంది అనుకుంటే అది కూడా దేవర మొదటి ట్రైలర్ లాగే ఉంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదే యాక్షన్, అదే డైలాగ్స్ అంటూ సోషల్ మీడియాలో కనబడుతున్నాయి.
దేవర సెకండ్ ట్రైలర్ లో కాస్త ఎమోషనల్ టచ్ ఇచ్చేలా కొరటాల చూపించినా ఇంకాస్త డిఫ్రెంట్ గా రెండో ట్రైలర్ ను చూపిస్తారని ఆశపడిన వారు మాత్రం సెకండ్ ట్రైలర్ చూసి కొద్దిగా నిరాశపడుతున్నారు.