ఈ నెల 23 నుంచి పవన్ కళ్యాణ్ షూటింగ్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. అందుకే ఆయన ఫెసిలిటీ కోసం విజయవాడ లో సినిమా సెట్స్ వేసి మరీ మేకర్స్ పవన్ కళ్యాణ్ ను షూటింగ్స్ కోసం పిలిచారు. ముందుగా పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ అన్నిటికన్నా ముందుగా సుజిత్ దర్శకత్వంలో OG పూర్తి చేస్తారని అనుకున్నారు. కారణం చాలా కొద్దిపాటి డేట్స్ ఇస్తే OG కంప్లీట్ అవుతుంది. కానీ పవన్ ముందుగా వీరమల్లు సెట్స్ లోకి దిగుతున్నారు. దానితో OG ని పవన్ కళ్యాణ్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారో అని చాలామంది మాట్లాడుకుంటున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ OG కూడా కదలబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం OG మ్యూఙిక్ సిట్టింగ్స్ చెన్నై లోని పార్క్ హయాత్ హోటల్లో జరుగుతున్నాయి. దర్శకుడు సుజిత్ అయితే ఫ్యామిలీతో సహా చెన్నైలో ఉంది OG పనులు చూసుకుంటున్నాడు. అంటే ఈలెక్కన విజయవాడలో OG సెట్ కూడా తయారవుతుంది అనుకుంటా. త్వరలోనే పవన్ ఇటు వీరమల్లు, అటు OG కంప్లీట్ చేసేలా కనబడుతుంది ప్రస్తుత వ్యవహారం.