దేవర చిత్రానికి ఏపీలో టికెట్ రేట్స్ హైక్ పై దేవర హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా మావయ్య చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ కు థాంక్స్ చెప్పాడు. దానితో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మొత్తం ఎన్టీఆర్ కి ఫిదా అయ్యారు. చంద్రబాబు కు ప్రత్యేకించి కృతఙ్ఞతలు చెప్పడంతో టీడీపీ అభిమానులంతా కూల్ అయ్యారు.
తాజాగా పవన్ కళ్యాణ్ తారక్ ట్వీట్ పై స్పందిస్తూ దేవర టీం కు బెస్ట్ విషెస్ చెప్పడమే కాదు గత ప్రభుత్వంలా తాము సినిమా వాళ్ళను వేధించమని, కూటమి ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీతో స్నేహపుర్వక సంబంధాలను మైంటైన్ చేస్తాము అంటూ పవన్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
My best wishes on your film release @tarak9999 garu. Our NDA Govt in AP under the leadership of SRI @ncbn garu will do the needful and standby for Telugu film Industry.. అంటూ పవన్ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.