బిగ్ బాస్ సీజన్ 8 లో వెండితెర మీద నటుడిగా కనిపించిన అభయ్ ఒక్కడే సెలెబ్రిటీ కంటెస్టెంట్ గా కనిపించాడు. సోషల్ మీడియా vs స్టార్ మా సీరియల్ స్టార్స్ మధ్యలో అభయ్ అన్నట్టుగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే భావన మొదటి రోజు నుంచి ఆడియన్స్ లో క్రియేట్ చేసాడు. సెటిల్డ్ గా గేమ్ ఆడడం, మిగతా కంటెస్టెంట్స్ తో కలుపుగోలు తనం, ఆటలో స్ట్రాంగ్ గా కనిపించడం అన్ని అతన్ని టాప్ 5 కంటెస్టెంట్ గా కనిపించేలా చేసాయి.
అయితే అభయ్ నార్మల్ కంటెస్టెంట్ గా ఉన్నప్పుడు అభయ్ అభయ్ లానే ఉన్నాడు. ఎప్పుడైతే క్లాన్ చీఫ్ గా మారాడో .. అప్పటి నుంచి బిగ్ బాస్ పై తన పైత్యం చూపించాడు. బిగ్ బాస్ పెట్టిన కండిషన్స్ పక్కనపెట్టి బిగ్ బాస్ టాస్క్ లను, బిగ్ బాస్ బిహేవియర్ ని వేలెత్తి చూపించడం పై దృష్టి పెట్టి టాస్క్ లను ఆడడం మానేసాడు.
దానితో ఈ వారం ఓటింగ్ లో వెనకబడిపోయాడు. స్ట్రాంగ్ అనుకుంటే అసలు ఓట్లు వెయ్యలేదు ఆడియన్స్. అంతేకాదు అభయ్ హౌస్ బిహేవియర్ పై నాగార్జున ఫుల్ క్లాస్ పీకారు. అటు ఓట్లు పడక, ఇటు నాగ్ వార్నింగ్ అని కలిపి టాప్ 5 లో ఖచ్చితంగా ఉంటాడన్న అభయ్ ఈ వారం మూడో కంటెస్టెంట్స్ గా ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది.