బిగ్ బాస్ సీజన్ 8 మూడు వారాలు పూర్తయ్యింది. హౌస్ మేట్స్ లో కొంతమంది యాక్టీవ్ గా ఉంటే మరికొందరు బిగ్ బాస్ పైనే జోక్స్ వేస్తున్నారు. బిగ్ బాస్ మెంటల్, బిగ్ బాస్ లఫంగి, బిగ్ బాస్ కి ధమాక్ లేదు అంటూ మాట్లాడిన అభయ్ ని శనివారం ఎపిసోడ్ లో నాగార్జున మాములుగా తిట్టలేదు, బిగ్ బాస్ నే అంటావా అంటూ బయటి కెళ్ళమని గేట్స్ ఓపెన్ చేసేసారు.
అలాగే ప్రేరణ విష్ణు ప్రియను కేరెక్టర్ లెస్ అనేందుకు, నిఖిల్ టీం లో బాగా ఆడిన సీతకు రెడ్ ఎగ్ ఇవ్వకుండా సోనియా కు రెడ్ ఎగ్ ఇచ్చిన నిఖిల్ ని, విష్ణు ప్రియా ని పుణ్యశ్రీ, పతివ్రతా అంటూ మాట్లాడిన మాటలకు, నాగమణికంఠ ప్రేరణ vs విష్ణు ప్రియా మధ్యలోకి రావడం పై నాగార్జున వారందరికీ ఎడా పెడా క్లాస్ పీకారు. అభయ్ అయితే సారి చెప్పాడు, హౌస్ మేట్స్ అందరూ అభయ్ ని ఉండాలని కోరుకోవడంతో నాగ్ అభయ్ ని క్షమించరు. ఆ తర్వాత ప్రేరణ, నిఖిల్ ఫేస్ లు మాడిపోయాయి.
నాగమణికంఠ ని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి యష్మి ని హాగ్ చేసుకోవడం పై క్లాస్ పీకారు.
ప్రేరణ కు-విష్ణు ప్రియకు మధ్యన ఉన్న గొడవను నాగ్ కెలికారు, ప్రేరణ తిట్టడం కరెక్ట్ కాదు అన్నారు నాగ్. ఆ తర్వాత విష్ణు ప్రియా అనకూడని మాటలు అనింది అనే వీడియోస్ తీసి నాగ్ చూపించారు. అమ్మాయిలు పంపులు, కుళాయిల దగ్గర కొట్టుకుంటారు అలా కొట్టుకున్నారు అంటూ శనివారం ఎపిసోడ్ మొత్తం నాగార్జున క్లాస్ పీకడంతోనే సరిపోయింది.