Advertisement

తెలంగాణలో రూ. 8,888 కోట్ల కుంభకోణం!

Sun 22nd Sep 2024 09:53 AM
ktr  తెలంగాణలో రూ. 8,888 కోట్ల కుంభకోణం!
Scandal in Telangana! తెలంగాణలో రూ. 8,888 కోట్ల కుంభకోణం!
Advertisement

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 8,888 కోట్లు కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధారాలతో సహా మీడియా ముందుకు వచ్చారు. ఈ భారీ కుంభకోణంపై విచారణ జరిపిస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోతుందని కూడా ఆరోపించారు. ఇంతకీ ఏమిటీ కుంభకోణం..? బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణల్లో నిజం ఎంత..? దీనిపై కాంగ్రెస్ రియాక్షన్ ఏంటి..? అనేది పూర్తిగా తెలుసుకుందాం వచ్చేయండి.

ఇదీ అసలు సంగతి!

రేవంత్ రెడ్డి రూ. 8,888 కోట్ల భారీ కుంభకోణం చేశారు. విచారణ జరిపిస్తే రేవంత్ రెడ్డి పదవి పొద్ది. ముఖ్యమంత్రి బావమరిది సూదిని సృజన్ రెడ్డి కంపెనీకి అర్హతలు లేకున్నా వేలకోట్ల రూపాయలు పనులను కట్టబెట్టారు. ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని పిలిపించి బెదిరించి ఆ కంపెనీ పేరుతో టెండర్లను కట్టబెట్టారు. పేరుకే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ అయినా రేవంత్ రెడ్డి బావమరిది కోసం ఈ టెండర్లను కట్టబెట్టారు అని కేటీఆర్ పెను సంచలనం సృష్టించే ఆరోపణలు చేశారు. అంతే కాదు.. ఇందులో టెండర్ దక్కించుకున్న ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీతో రేవంత్ రెడ్డి బావమరిది కంపెనీతో జాయింట్ వెంచర్ పేరుతో డ్రామాకి తెరలేపారని కూడా ఆరోపించారు.

వెయ్యి కోట్లు తేడానా..?

వాస్తవానికి.. 1137 కోట్ల రూపాయల కాంట్రాక్టు గెలుచుకున్న తర్వాత ఆ కంపెనీ 20 శాతం పని చేస్తుంది. కానీ ముఖ్యమంత్రి బావమరిది మాత్రం 80% పని అంటే వెయ్యి కోట్ల పని చేస్తుందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఇంత పెద్ద భారీ కుంభకోణానికి రేవంత్ రెడ్డి పాల్పడ్డారని.. తాను బాధ్యతలు నిర్వహిస్తున్న పురపాలక శాఖ కేంద్రంగా రేవంత్ రెడ్డి ఈ కుంభకోణాన్ని చేశారన్నారు. ఈ భారీ కుంభకోణంతో రేవంత్ రెడ్డి పదవీ కోల్పోయి అవకాశం ఉన్నదని కేటీఆర్ జోస్యం చెప్పారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. బామ్మర్ది కోసం టెండర్లు రద్దు చేసి మరీ అప్పగించారని పదే పదే చెప్పడంతో అందరికీ అనుమానాలు వస్తున్న పరిస్థితి.

అబ్బే అస్సలు కాదు!

సృజన్ రెడ్డికి చెందిన శోధ కంపెనీకి రూ.1,137.37 కోట్ల విలువైన కాంట్రాక్ట్ ఇవ్వడం కోసమే గతంలో ఖరారు అయిన టెండర్లు రద్దు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మళ్ళీ టెండర్లు పిలిచి అప్పజెప్పినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. సృజన్ రెడ్డి.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడు అని  పొంగులేటి వివరణ ఇచ్చుకున్నారు. అనవసర ఆరోపణలు చేసినందుకు కేటీఆర్‌పై పరువు నష్టం దావా వేసి, చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. తాము రూ.8,888 కోట్లకు టెండర్లు పిలిచినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని, నిరూపించకుంటే కేటీఆర్ రాజీనామా చేస్తారా? అని సవాల్ చేశారు. మొత్తానికి చూస్తే మొన్న రాజీవ్ గాంధీ విగ్రహం.. నిన్న అరికేపూడి గాంధీ వ్యవహారంతో అట్టుడికిన తెలంగాణ ఇప్పుడిప్పుడే చల్లబడుతోంది అనుకునే లోపే.. ఇప్పుడు కేటీఆర్ అమెరికా నుంచి రావడంతో 8,888 కోట్ల రూపాయల కుంభకోణం వ్యవహారంతో మళ్ళీ వేడెక్కిందని చెప్పుకోవచ్చు.

Scandal in Telangana!:

BRS is alleging that the scandal took place after the Congress party came to power

Tags:   KTR
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement