అవును.. మీరు వింటున్నది నిజమే..! వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పట్లో మారేలా లేరు..! అదేంటి అధికారం పోయిన తర్వాత కాస్తో కూస్తో మారారు కదా అని అనుకుంటున్నారు ఏమో అబ్బే అస్సలు కానే కాదు అని సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇంతకీ అసలు విషయం ఏంటి అనేది అర్థమయ్యే ఉంటుంది కదా!
ఇదీ అసలు సంగతి!
వైఎస్ జగన్ పేపర్ లేనిదే.. అదేనబ్బా స్క్రిప్ట్ లేనిదే మీడియా ముందుకు రావడానికి అస్సలు సాహసం చేయట్లేదు. పోనీ స్క్రిప్ట్ చూసి అయినా పదాలు సరిగ్గా పలుకుతున్నారా అంటే అదీ లేదు.
తెలుగు పదాలు సక్రమంగా పలకలేదు.. పోనీ ఇంగ్లీష్ పదాలు అయినా సరిగ్గా మాట్లాడుతున్నారా అంటే అదీ లేదు. శుక్రవారం నాడు.. తిరుమల లడ్డు వివాదంపై క్లారిటీ ఇవ్వడానికి మీడియా ముందుకు వచ్చిన జగన్.. NABL (National Accreditation Board for Testing and Calibration Laboratories) ఈ అబ్జర్వేషన్ పలకడానికి నానా పాట్లు పడ్డారు. ఇదొక్కటే కాదు అజీర్ణా శక్తిలో ఉన్న పదం పలకడానికి అబ్బో ఇక మాటల్లో చెప్పలేం. ఇప్పుడు ఇవన్నీ ప్రత్యర్థి పార్టీలు ఒక రేంజిలో ట్రోల్ చేస్తున్నాయి. ఇక మీమ్స్ అంటారా ఆ కథే వేరులే!
చూసి కూడా ఏంటబ్బా!!
పోనీ ఇదంతా పేపర్ లేకుండా చదివారా..? అబ్బే అస్సలు కానే కాదే! అధికారంలో ఉన్నన్ని రోజులు ఏదో వీడియో రిలీజ్ చేసి మేనేజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే మీడియా ముందుకు రావడం మొదలు పెట్టిన జగన్.. వచ్చి కూడా అభాసుపాలు అవుతున్న పరిస్థితి. దీంతో.. లేక లేక మీడియా ముందుకొచ్చి మీమర్స్, ట్రోలర్స్ కు మంచి స్టఫ్ ఇస్తున్నారని గట్టిగానే సొంత పార్టీ వాళ్ళే గుసగుసలాడుతున్న పరిస్థితి. చూసి రాతలు సరిగ్గా చదవకుంటే ఎలా.. ఇంకెన్నాళ్ళు ఇలా మార్పు రాదా తమరిలో..? అంటూ కార్యకర్తలు కొందరు అసంతృప్తి వెలిబుచ్చుతున్నారు. ఎందుకంటే లడ్డు వివాదంపై మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చిన దానికంటే ట్రోలింగ్స్ ఎక్కవ అవుతుందటమే ఇందుకు కారణం. ఐనా జగన్ రెడ్డిలో మార్పు ఎప్పుడు వస్తుందో ఏంటో మరి..!