Advertisementt

ప్రభాస్ ఫుడ్ పంపిస్తే ఓ విలేజ్ కి సరిపోతుంది

Sat 21st Sep 2024 07:52 PM
malavika mohanan  ప్రభాస్ ఫుడ్ పంపిస్తే ఓ విలేజ్ కి సరిపోతుంది
If Prabhas sends food, it is enough for a village ప్రభాస్ ఫుడ్ పంపిస్తే ఓ విలేజ్ కి సరిపోతుంది
Advertisement
Ads by CJ

ప్రభాస్ తో వర్క్ చేసే హీరోయిన్స్ అంతా ప్రభాస్ ఇచ్చే ఫుడ్ ట్రీట్ కి పడిపోవడం చూస్తున్నాము. ఆయనతో పని చెసే ఏ హీరోయిన్ అయినా సరే ప్రభాస్ పంపించే లంచ్ గురించి చాలా స్పెషల్ గా షేర్ చేస్తూ ఉంటారు. అనుష్క, శృతి హాసన్, శ్రద్ద దాస్, దీపికా పదుకోన్ ఇప్పుడు మాళవిక మోహనన్ ప్రభాస్ ఫుడ్ పై హాట్ కామెంట్స్ చేసారు. 

తంగలాన్ ఈవెంట్ లోనే ప్రభాస్ పంపించే ఫుడ్ తన తల్లి వంట చేసి పెట్టినట్టే అంటే అమ్మ వండినట్టే ఉంటుంది అంటూ మాట్లాడిన మాళవిక మోహనన్ మరోమారు ప్రభాస్ పంపించే స్పెషల్ డిష్ లపై కామెంట్స్ చేసింది. ఆమె నటించిన యోధ్ర ప్రమోషన్స్ లో మాళవిక మోహనన్ మాట్లాడుతూ.. ప్రభాస్ రాజా సాబ్ తో తెలుగులోకి ఎంటరవ్వబోతునందుకు చాలా హ్యాపీ గా ఉంది, చాలా రోజుల నుంచి మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేసాను. 

రాజా సాబ్ లో నా పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. ప్రభాస్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంటర్ అవడం అదృష్టంగా ఫీలవుతున్నాను. రాజా సాబ్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది. ప్రభాస్ పంపించే ఫుడ్ గురించి చెప్పాలంటే భోజనానికి ఓ బిర్యానీనా, లేదంటే ఓ కరినో కాదు.. పెద్ద పెద్ద డిష్ లలో ఆయన పంపించే వంటకాలు ఓ గ్రామానికి సరిపోతాయి. 

ఇప్పటివరకు అంత రుచికరమైన భోజనం చెయ్యలేదు అంటూ మాళవిక మోహనన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. 

If Prabhas sends food, it is enough for a village:

Malavika Mohanan About Food Sent By Prabhas

Tags:   MALAVIKA MOHANAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ