ఇప్పటికే అంటే గత రాత్రి బిగ్ బాస్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అభయ్ తో పాటుగా మిగతా హౌస్ మేట్స్ అందరిని నించోబెట్టి ఇది బిగ్ బాస్ హౌస్.. ఇక్కడ ఉన్నవాళ్లు బిగ్ బాస్ రూల్స్ పాటించాలి, లేదంటే ఇప్పుడే ఈ క్షణానే మీరు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోవచ్చు అని డోర్స్ ఓపెన్ చేసి మరీ సీరియస్ వార్నింగ్ ఇవ్వగా దానికి అభయ్ అప్పుడే సారి చెప్పిన విషయం తెలిసిందే.
ఇప్పుడు అదే విషయంలో వీకెండ్ ఎపిపోడ్ లో కింగ్ నాగార్జున అభయ్ మీద చిందులు వేశారు. బిగ్ బాస్ పై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడావ్.. నువ్వు బిగ్ బాస్ హౌస్ లో ఉండి రూల్స్ అతిక్రమించావ్ అంటూ చాలా కోపంగా రెడ్ కార్డు చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసారు. అభయ్ కింద కూర్చుని సారి చెప్పినా నాగార్జున నువ్వు బిగ్ బాస్ లో ఉండడానికి వీల్లేదు అంటూ బిగ్ బాస్ కి డోర్స్ ఓపెన్ చెయ్యమని చెప్పారు.
యష్మి లేచి ఈ ఒక్కసారి అభయ్ ను వదిలెయ్యాని చెప్పినా నాగార్జున కోపం తగ్గలేదు. నేను ఒప్పుకోను అభయ్ హౌస్ లో ఉండేందుకు అనర్హుడు అంటూ చెప్పారు. మరి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఆయిన అభయ్ నోటి దూల వలన హౌస్ నుంచి వెళ్ళిపోతాడా.. లేదంటే సీరియస్ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా అనేది ఈరోజు శనివారం ఎపిసోడ్ లో చూడబోతున్నారు.