Advertisementt

మోహన్ బాబు కూడా తల్లడిల్లిపోయారట

Sat 21st Sep 2024 05:52 PM
manchu mohan babu  మోహన్ బాబు కూడా తల్లడిల్లిపోయారట
Manchu Mohan Babu on Tirupati laddu issue మోహన్ బాబు కూడా తల్లడిల్లిపోయారట
Advertisement
Ads by CJ

ప్రస్తుతం తిరుపతి లడ్డు ప్రసాదం పై జరుగుతున్న వివాదం ఎంతోమంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుంది. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి ప్రస్తుతం కాక రేపింది. దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు లేపుతుంది. జగన్ హయాంలో కల్తీ నెయ్యి తో శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీ పై జరుగుతన్న రచ్చ పై చాలామంది స్పందిస్తున్నారు. తాజాగా ఈ విషయంలో మంచు మోహన్ బాబు స్పందించారు. 

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి హిందూ పూజించే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి. ఆ దైవానికి నిత్యం సమర్పించే లడ్డూలలో కలిపే ఆవు నెయ్యిలో దాదాపు 3 నెలల క్రితం వరకు ఇతర జంతువుల కొవ్వుని కలుపుతున్నారని తెలియగానే ఒక భక్తుడిగా తల్లడిల్లిపోయాను, తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను.

నిత్యం మా మోహన్ బాబు విశ్వవిద్యాలయం నుంచి కన్పించే తిరుమల క్షేత్రాన్ని చూసి నాతోపాటు వేలాదిమంది ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్ధులు, నిత్యం భక్తిపూర్వకంగా నమస్కరించుకుంటూ ఉంటాం. ఆ స్వామి దగ్గర ఇలా జరగడం ఘోరం, పాపం, ఘోరాతి ఘోరం, నికృష్టం, అతినీచం, హేయం, అరాచకం.

ఇదేగాని నిజమైతే నేరస్థులను శిక్షించాలని నా ఆత్మీయుడు, నా మిత్రుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుని హృదయపూర్వకంగా కోరుకుంటూ... ఈ కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు నా మిత్రుడు అందుకుని నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను.

డా॥ మంచు మోహన్ బాబు అంటూ ప్రెస్ నోట్ వదిలారు. 

Manchu Mohan Babu on Tirupati laddu issue:

Manchu Mohan Babu press note on Tirupati laddu issue

Tags:   MANCHU MOHAN BABU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ