కోలీవుడ్ స్వీట్ కపుల్ జయం రవి-ఆర్తి విడాకుల విషయం లో జయం రవి అధికారికంగా ప్రకటిస్తూ తమ ప్రవేట్ లైఫ్ ని డిస్టర్బ్ చెయ్యొద్దని మరీ చెప్పాడు. ఆ వెంటనే ఆయన భార్య ఆర్తి.. తమకు చెప్పకుండా రవి ఎలా విడాకుల విషయాన్ని అనౌన్స్ చేస్తారు, తాను జయం రవి తో మాట్లాడాలని చూసినా తనకు అవకాశం ఇవ్వడం లేదు అంటూ సోషల్ మీడియా వేదికగా సంచలన కామెంట్స్ చేసింది.
తాజాగా జయం రవి భార్య ఆర్తి ఆరోపణలపై బ్రదర్ మూవీ ప్రమోషన్స్ లో స్పందించారు. మా డివోర్స్ పై ఎన్నో రకాల డిస్కర్షన్స్ జరుగుతున్నాయి. కొంతమంది నా బాధను అర్ధం చేసుకుంటున్నారు. మరికొంతమంది అంటే వినయం, విధేయత లేని వాళ్ళు నన్ను నా పర్సనల్ లైఫ్ ని విమర్శించడమే పనిగా పెట్టుకుంటున్నారు. నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. నేను కోర్టులో నిరూపించుకుంటాను.
నిజం బయటికి వచ్చినప్పుడు నాపై ఆరోపణలు చేసేవారంతా తగిన చర్యలకు సిద్ధంగా ఉండండి. నేను ఎంతో జాగ్రత్తగా స్క్రిప్ట్ లు ఎంపిక చేసుకుని కెరీర్ ని నడిపించుకుంటున్నప్పటికీ నా పేరు ప్రతిష్ఠలు దెబ్బ తీసేందుకు చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. నేను డివోర్స్ నోటీసు ఇచ్చింది ఆర్తి తండ్రికి కూడా తెలుసు.
అంతేకాదు మా విడాకుల గురించి ఇరు కుటుంబాల పెద్దలు కూర్చుని చర్చించుకున్నారు. నేను అందుబాటులో లేను, వారికి తెలియకుండా విడాకుల విషయం ప్రకటించాను అని ఎలా చెబుతారు. నా పెద్ద కొడుకు అర్నవ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ కు జూన్ లో నేను చెన్నై లోనే ఉన్నాను. నా పెద్ద కొడుకుకు విడాకుల విషయం తెలుసు, ఆర్నవ్ కు నేను ఆర్తి కలిసి ఉండాలనేది వాడి కోరిక అంటూ జయం రవి ఆర్తి ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారు.