థియేటర్స్ లోకి వచ్చే చిన్న సినిమాలు పెద్ద హిట్ అయినా కూడా ప్రేక్షకులు ఆ సినిమాలను థియేటర్స్ లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కారణం ఆ సినిమాలను ఓటీటీలలో చూడొచ్చులే అనే ధీమా. థియేటర్స్ లో సూపర్ హిట్ టాక్ వచ్చినా కలెక్షన్స్ రావడం లేదు. అందుకే థియేటర్స్ లో విడుదలైన రెండుమూడు వారాల్లోనే మేకర్స్ వాటిని ఓటీటీలలో స్ట్రీమింగ్ కి తెచ్చేస్తున్నారు.
ఈమధ్యనే రెండు వారాల క్రితమే థియేటర్స్ లోకి వచ్చిన సినిమా 35 చిన్న కథ కాదు కి ఆడియన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. క్రిటిక్స్ ఓవరాల్ గా 3 రేటింగ్స్ తో సినిమా హిట్ అనేసారు. కానీ ఈ సినిమా చూసేందుకు థియేటర్స్ లో ఆడియన్స్ కనిపించలేదు. కారణం చిన్న సినిమా.
నివేత థామస్ - ప్రియదర్శి కలయికలో రానా బ్యానర్ నుంచి వచ్చిన ఈ చిత్రం ఇప్ప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది అనే వార్త వైరల్ అయ్యింది. 35 చిన్న కథ కాదు చిత్రాన్ని ఆహా ఓటీటీ ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకోగా.. సెప్టెంబర్ 27 నుంచి ఈ చిత్రాన్ని ఓటీటీ లో స్ట్రీమింగ్ చెయ్యాలని ఆలోచన చేస్తున్నారట.
సెప్టెంబర్ 7 న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం మూడు వారాలు తిరిగే లోపు ఆహా ఓటీటీ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది అని తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వస్తుంది అని సమాచారం.