మెగాస్టార్ చిరంజీవి-రామ్ చరణ్ కాంబోలో కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య సినిమా వచ్చి రెండేళ్లు పైనే అయ్యింది. అయితే ఆచార్య రిజల్ట్ చిరంజీవి, రామ్ చరణ్ అంచనాలకు తల్లకిందులుగా రావడంతో మెగా అభిమానులు మాత్రమే కాదు మెగా ఫ్యామిలీ మొత్తం డిజ్ పాయింట్ అయ్యింది. ఆ తర్వాత చిరంజీవి పలు సందర్భాల్లో దర్శకులు పూర్తి స్క్రిప్ట్ లేకుండా సెట్స్ లకి వచ్చేస్తూ హరి బరిగా సినిమాలను ముగించెయ్యడంతో ఆ సినిమాలు నిరాశపరుస్తున్నాయని, ఇంకా చాలాసార్లు ఇండైరెక్ట్ గా కొరటాలపై తన అసంతృప్తిని వెళ్లగక్కారు.
కొరటాల శివ ఆచార్య కన్నా ముందే సోషల్ మీడియా నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత కొరటాల ఎక్కడా ఆచార్య రిజల్ట్ పై ఎలాంటి కామెంట్స్ చెయ్యలేదు. అయితే ఆచార్య తెరకెక్కించేటప్పుడు రామ్ చరణ్ ను గెస్ట్ రోల్ అనుకుంటే.. చరణ్ కేరెక్టర్ ను కీలకంగా మార్చేందుకు చిరు స్క్రిప్టు విషయంలో మార్పులు చేసారని, కొరటాల పై నమ్మకం ఉంచితే ఆచార్య రిజల్ట్ వేరేలా ఉండేదనే కామెంట్స్ అప్పట్లో సోషల్ మీడియాలో గట్టిగానే వినిపించాయి.
తాజాగా దేవర ప్రమోషన్స్ లో కొరటాల శివ ప్రపంచంలో ఎవరి పని వారు భయ భక్తులతో చేసుకుంటే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది, పక్కనోడి పనిలో వేలు పెట్టకుండా ఉంటే బావుంటుంది అంటూ కొరటాల చేసిన కామెంట్స్ ఆచార్య స్క్రిప్ట్ విషయంలో మెగాస్టార్ ను ఉద్దేశించి చేసినవే.. ఇన్నాళ్లకు కొరటాల ఆచార్య విషయాన్ని కెలికాడంటూ సోషల్ మీడియాలో మరోసారి వివాదం మొదలైంది.
అసలే మెగా vs ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్న రేంజ్ లో సోషల్ మీడియాలో రచ్చ జరుగుతున్న సమయంలో కొరటాల దేనిని ఉద్దేశించి ఆ కామెంట్స్ చేసినా అది ఆచార్యకు సంబంధించి అంటూ మెగా ఫ్యాన్స్ ఉలిక్కిపడడం మరోసారి వివాదాస్పదం అయ్యింది.