హీరో నాని-వివేక్ ఆత్రేయ ల కలయికలో తెరకెక్కిన సరిపోదా శనివారం ఆగష్టు 29 న థియేటర్స్ లో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆడియన్స్ తో పాటుగా సినీ విమర్శకులు కూడా సరిపోదా శనివారానికి సూపర్ హిట్ రివ్యూస్ ఇవ్వడంతో నాని దసరా తర్వాత మరోసారి 100కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టాడు.
పాన్ ఇండియా మార్కెట్ లో సరిపోదా శనివారం వర్కౌట్ అవ్వకపోయినా రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మంచి కలెక్షన్స్ రాబట్టింది. అందుకే ఈ చిత్ర ఓటీటీ రిలీజ్ పై ఫ్యామిలీ ఆడియన్స్ కన్ను పడింది. సరిపోదా శనివారం ఓటీటీ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో సొంతం చేసుకుంది.
అయితే కొద్దిరోజుల ముందు ఈ చిత్రం ఓటిటి ఎంట్రీ ఈ సెప్టెంబర్ 27న అలా ఉంటుంది అని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు దీనిపై అఫీషియల్ క్లారిటీ అయితే వచ్చేసింది. సరిపోదా శనివారాన్ని నెట్ ఫ్లిక్స్ వారు ఈ సెప్టెంబర్ 26 నుంచి పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నట్టుగా పోస్టర్ వేసి వదిలారు. మరి థియేటర్స్ లో విడుదలైన నెల పూర్తి కాకుండానే సరిపోదా శనివారం ఓటీటీలోకి వచ్చేస్తుంది.