ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో జానీ మాస్టర్ ఇష్యు హాట్ టాపిక్ అయ్యింది. తన దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన లేడీ కొరియోగ్రాఫర్ పట్ల జానీ మాస్టర్ వ్యవహరించిన తీరుకు ఈరోజు అతను జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. లేడీ కొరియాగ్రాఫర్ ను లైంగికంగా వేధించిన కేసులో జానీ మాస్టర్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మరోపక్క పోలీసులు పది రోజులు కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు.
అయితే ఆ లేడీ కొరియోగ్రాఫర్ తో జానీ మాస్టర్ వ్యవహారం నడిపింది నిజమే అని, జానీ మాస్టర్ భార్య అయేషా కూడా పలుమార్లు ఆమెని జానీ తో పెళ్ళికి ఒప్పించేందుకు ప్రయత్నం చెయ్యడమే కాదు ఆ అమ్మాయిని మతం మార్చుకోమని దాడి కూడా చేసినట్లుగా అభియోగాలున్నాయి. అయితే ఈ ఘటన పై ఆ లేడీ కొరియాగ్రాఫర్ కి మద్దతుగా చాలామంది నటీమణులు నిలుస్తున్నారు.
అనసూయ కూడా ఆ అమ్మాయిని తాను పుష్ప 2 సెట్స్ లో చూశాను అని చెప్పింది. తాజాగా జానీ మాస్టర్ వైఫ్ పుష్ప 2 సెట్స్ లో ఉండగానే ఈ గొడవ సుకుమార్ దగ్గరకు వెళ్ళింది, సుకుమార్ తనని జానీ మాస్టర్ ని పిలిపించి అసలు ఏమిటి గొడవ అని కనుక్కున్నారు, జరిగినదంతా చెప్పాము, అప్పుడు సుకుమార్ గారు అంతా మర్చిపోండి, మీ లైఫ్ మీది, ఆ అమ్మాయి లైఫ్ అమ్మాయిది అని చెప్పారు, అంతేకాదు పుష్ప 2 లో ఆమెకి మరో సాంగ్ కూడా ఇచ్చారు అంటూ జానీ మాస్టర్ వైఫ్ అయేషా చెప్పడంతో జానీ మాస్టర్-లేడీ కొరియాగ్రాఫర్ వ్యవహారం పుష్ప 2 సెట్స్ లోనే పంచాయితీ వరకు వెళ్ళినట్లుగా తెలుస్తుంది.
ప్రస్తుతం జానీ మాస్టర్ పై పొక్సో కేసు నమోదు కాగా.. అతన్ని పోలీసులు ఉప్పర్ పల్లి కోర్టు నుంచి నేరుగా చంచల్ గూడా జైలుకు తరలించారు.