సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మద్యన జరిగే గొడవలు ఆపాలంటే ఎన్టీఆర్ తో పాటుగా రామ్ చరణ్ కూడా ఏదో ఒకటి చెయ్యాలి అంటే.. ఎన్టీఆర్ దేవర పై విషం చిమ్ముతున్న కొంతమంది యాంటీ అభిమానులను చరణ్ ముందుకొచ్చి ఆపాల్సి ఉంది అనేది కొంతమంది ఎన్టీఆర్ అభిమానుల వాదన. దేవర పై సోషల్ మీడియాలో జరుగుతున్న, కనిపిస్తున్న నెగిటివిటీ ఈమధ్య కాలంలో ఏ తెలుగు చిత్రం పైన చూడలేదు.
దేవర చిత్రాన్ని ఎలాగైనా చంపేయాలని ఓ వర్గం ఫ్యాన్స్ కాచుకుని కూర్చుని.. దేవర ను ట్రోల్ చేస్తున్నారు. యావరేజ్ టాక్ వచ్చినా సోషల్ మీడియా మీద పడి సినిమా ఆడనివ్వకుండా చెయ్యాలని ప్లాన్స్ చేస్తున్నారనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రధాన ఆరోపణ. అందులో మెగా ఫ్యాన్స్ కావాలనే దేవర పై కక్ష కట్టారని అంటున్నారు.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగా దేవర అప్ డేట్స్ ని షేర్ చేస్తూ హడావిడి చేస్తున్నా మరోపక్క మెగా అభిమానులు ఆచార్య డిసాస్టర్ ను దృష్టిలో ఉంచ్చుకుని దేవర పై విషం చిమ్ముతున్నారు, దేవర సినిమా పై ఇంత నెగిటివిటి ఎందుకు, ఆర్.ఆర్.ఆర్ లో కలిసి మెలిసి కనిపించిన చరణ్-ఎన్టీఆర్ ఇద్దరూ అభిమానుల ముందుకు రావాలి, లేదంటే ఇద్దరూ కలిసి ఏదైనా వీడియో వదిలితేనే కానీ ఈ దేవర పై ట్రోల్స్ ఆగవని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
మరి ఈ సమయంలో చరణ్-ఎన్టీఆర్ కలిసి కనిపించడం అయ్యే పనేనా. అభిమానులే ఆలోచించుకోవాలి. ఇప్పుడు దేవర పై విషం చిమ్మితే తర్వాత గేమ్ ఛేంజర్ లేకపోలేదు.