పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఏపీలో పరిస్థితులను చక్కబెడుతూ బ్యాక్ టు వర్క్ అంటూ సినిమా షూటింగ్స్ కి హాజరు కాబోతున్నారు. గత ఏడాది బాబుగారు జైలుకెళ్ళినపుడు మానేసిన సినిమా షూటింగ్స్ మళ్ళీ ఇప్పటివరకు మొదలు కాలేదు. ఈ మధ్యలో కూటమి కట్టడం, ఆ తర్వాత ఎన్నికలు, గెలుపు, డిప్యూటీ సీఎం అవ్వడం అన్ని చక చకా జరిగిపోయాయి.
ప్రస్తుతం సినిమా షూటింగ్స్ కి పవన్ హాజరవుతున్నట్టుగా అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. ఈ నెల 23 నుంచి పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఫెసిలిటీ కోసం మేకర్స్ విజయవాడ లోనే హరి హర వీరమల్లు సెట్ వేసి మరీ షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు.
అయితే అందరూ ముందుగా పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో దానయ్య నిర్మిస్తున్న OG పూర్తి చేస్తారు, ముందు పవన్ OG సెట్స్ లోకే వెళ్తారని అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ అన్నిటికన్నా ముందు హరి హర వీరమల్లు కంప్లీట్ చేసేందుకు రెడీ అయినట్లుగా ఇప్పుడొచ్చిన అప్ డేట్ చూస్తే అర్హమవుతుంది. మరి అక్టోబర్ నుంచి ఏమైనా OG సెట్స్ లోకి పవన్ వెళ్తారేమో చూడాలి.