Advertisementt

BB8: ఈ వారం డేంజర్ జోన్ లో ఆ ఇద్దరూ..

Sat 21st Sep 2024 10:03 AM
bigg boss telugu 8  BB8: ఈ వారం డేంజర్ జోన్ లో ఆ ఇద్దరూ..
BB8: Those two in the danger zone this week.. BB8: ఈ వారం డేంజర్ జోన్ లో ఆ ఇద్దరూ..
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 8 మొదలై మూడు వారాలు పూర్తవుతుంది. గత రెండు వారాల్లో 14 మంది కంటెస్టెంట్స్ లో బెజవాడ బేబక్క, శేఖర్ భాషాలు ఎలిమినేట్ అయ్యారు. ఇక హౌస్ మొత్తం టాస్క్ ల హడావిడి, గేమ్ లో కంటెస్టెంట్స్ కొట్లాటతో సంత లా తయారైంది. 

నామినేషన్ విషయంలో హౌస్ మేట్స్ మద్యన పెద్ద వార్ జరిగింది. ఈ వారం కూడా ఎనిమిదిమంది నామినేషన్స్ లో ఉన్నారు. అందులో విష్ణు ప్రియా ఓటింగ్ లో టాప్ ప్లేస్ లో ఉంది. ఈ వారం ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయినప్పటి నుంచి విష్ణు ప్రియా కు భారీగా ఓట్స్ గుద్దుతున్నారు ఆమె అభిమానులు. ఆ తర్వాత సింపతీ గేమ్ ఆడే నాగమణికంఠ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 

డాన్సర్ నైనిక మూడో స్థానంలో, సీత నాలుగో స్థానంలో, ప్రేరణ ఐదో స్థానంలో ఉన్నారు. ఇలా చూసుకుంటే దాదాపు వీరంతా సేఫ్ జోన్ లో ఉన్నట్లే. ఇక ఆరో స్థానంలో యష్మీ, ఏడో స్థానంలో పృథ్వీరాజ్, ఎనిమిదో స్థానంలో అభయ్ ఉన్నారు. అభయ్ అన్ని రూల్స్ తో గేమ్ ఆడాలి, బిగ్ బాస్ ఫుడ్ లేకుండా చేస్తున్నాడంటూ బిగ్ బాస్ పై ఫైర్ అవుతున్నాడు కానీ.. ఆటలో కండబలం, బుద్ధిబలం చూపలేకపోతున్నాడు. 

ఇక పృథ్వీ కూడా ఆటని ఆటలా కాకుండా కండబలంతో ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోతున్నాడు. మరి పృథ్వీ, అభయ్ లలో ఎవరో ఒకరు ఈవారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. 

BB8: Those two in the danger zone this week..:

Bigg Boss Telugu 8: Elimination Week 3 Latest Voting Results

Tags:   BIGG BOSS TELUGU 8
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ