అక్కినేని ప్రిన్స్ అఖిల్ గత ఏడాదిన్నరగా మీడియా ముందుకు కానీ, అభిమానుల ముందుకు కానీ రావడం లేదు. ఏజెంట్ నిరాశ పరిచాక కొత్త సినిమా మొదలు పెట్టిన దాఖలాలు లేవు. అసలు అఖిల్ కొత్త ప్రాజెక్ట్ పై ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా కింగ్ నాగ్ సైలెన్స్ ను మైంటైన్ చేస్తున్నారు.
తాజాగా నాగార్జున కొడుకు అఖిల్ హిట్ కొట్టాకే అభిమానుల ముందుకు వస్తాను అని చెప్పమన్నాడు అంటూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా అక్కినేని ఫ్యామిలి మొత్తం హాజరైన ఈవెంట్ లో ANR అవార్డు ను మెగాస్టార్ కి అమితాబ్ చేతుల మీదుగా అందించబోతున్నట్టుగా చెప్పిన నాగార్జున అఖిల్ విషయమై స్పందించారు.
మీడియా వారు అఖిల్ గురించి అడగగానే.. అఖిల్ హిట్ కొడితే తప్ప అభిమానుల ముందుకు రానంటున్నాడు. అందుకే నా చేత మీరందరూ ఎలా ఉన్నారో అని అడగమన్నాడు అంటూ నాగార్జున అక్కినేని అభిమానులకు అఖిల్ విషయంపై క్లారిటీ ఇచ్చారు.