లేడీ కొరియాగ్రాఫర్ ని లైంగికంగా వేధించిన కేసులో అరెస్ట్ అయ్యి చంచల్ గూడా జైలుకు రిమాండ్ పై వెళ్లిన జానీ మాస్టర్ కేసు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నిన్న గురువారం గోవా లో అరెస్ట్ చేసిన జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు పొందుపరిచారు. ఈ కేసులో జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.
మరోపక్క ఈరోజు వైద్య పరీక్షల అనంతరం ఉప్పర్ పల్లి కోర్టులో జానీ మాస్టర్ ను హాజరు పరచగా జెడ్జి జానీ మాస్టర్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. కోర్టు నుంచి నేరుగా జానీ మాస్టర్ ను పోలీసులు చెంచల్ గూడా జైలుకు తరలించారు. అయితే జానీ మాస్టర్ తానేమి తప్పు చెయ్యలేదు, తనని ఈ కేసులో కావాలనే ఇరికించారు. తనని ఇరికించిన ఎవ్వరిని వదలను.
నేను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదు. కావాలనే కొందరు నాపై ఫిర్యాదు చేయించారు. న్యాయపరంగా పోరాడి నిజాయితీగా బయటకు వస్తాను అంటూ జానీ చెప్పినట్లుగా తెలుస్తోంది.