బిగ్ బాస్ హౌస్ లో సోనియా ఆడే డబుల్ గేమ్ కి మిగతా హౌస్ మేట్స్ చిత్తు చిత్తు అవుతున్నారు. నిఖిల్, పృథ్వీ లను తన చుట్టూ తిప్పుకుంటున్న సోనియా మైండ్ గేమ్ కి నిజంగానే నిఖిల్ టీం షాకైపోయింది. తన క్లాన్ మొత్తాన్ని మోసం చేసి నిఖిల్ సోనియా కి ఓటెయ్యడం చూస్తే సోనియా అసలు గేమ్ కన్నా ఎక్కువగా నిఖిల్ ని తన చుట్టూ తిప్పుకునే గేమ్ లో పర్ఫెక్ట్ గా సక్సెస్ అయ్యింది అనిపించేలాంటి ప్రోమో వదిలారు.
ప్రోమోలోకి వెళితే.. సోనియా అలిగితే.. కిచెన్ లో ఉన్న నిఖిల్ తిన్నావా అని అడిగితే అది నువ్వు తినేటప్పుడు అడగాల్సింది అంటూ సోనియా అక్కడి నుంచి వచ్చి అభయ్ దగ్గర కూర్చుని నేను తిన్నానో లేదో నిఖిల్ ముందే అడగాల్సింది సుద్దపూస ఇప్పుడు అడుగుతున్నాడు అంటూ అభయ్ తో చెప్పింది. ఆ తర్వాత నిఖిల్ కూడా తన పర్సనల్ విషయాలపై జోక్స్ వేసినప్పుడు లేదు ఇప్పుడొచ్చింది సోనియాకి అన్నాడు.
ఈమద్యలో బిగ్ బాస్ ప్రభావతి ఇచ్చిన రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉంది అంటే నిఖిల్ మా శక్తి క్లాన్ దగ్గర ఉంది అన్నాడు. ఆ రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు క్లాన్ కంటెండర్ అవుతారని బిగ్ బాస్ చెప్పాడు. కట్ చేస్తే సోనియా వెళ్లి నిఖిల్ ని అందరి ముందు నిన్ను అలా అన్నందుకు సారి అంది. ఆ తర్వాత నిఖిల్ మీ దగ్గర ఉన్న రెడ్ ఎగ్ ఎవరికిస్తారనగానే అతని సోనియా అన్నాడు. దానితో వాళ్ళ టీమ్ సబ్యుల ఫేస్ లు మాడిపోయాయి.
సీత అయితే తాను బాగా ఆడాను కానీ నిఖిల్ మోసం చేసాడంటూ ఏడుస్తుంది. నిఖిల్ ఓదార్చినా సీత ఊరుకోలేదు. ఇక నాగమణికంఠ ఈ సంఘటన బిగ్ బాస్ చరిత్రలో నిలిచిపోతుంది అంటూ నిఖిల్-సోనియా వ్యవహారంపై వదిలిన ప్రోమో మాత్రం బాగా వైరల్ గా మారింది.