యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ చిత్రం దేవర, సెప్టెంబర్ 27 న విడుదల కాబోతున్న దేవర చిత్ర ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ చాలా ఎనర్జిటిక్ గా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. జాన్వీ కపూర్, కొరటాల శివ తో కలిసి మేఘాల్లో తిరుగుతున్న ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్ లోనే తాను నటించబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ NTR 31 పై చేస్తున్న కామెంట్స్ వైరల్ గా మారిపోతున్నాయి.
ఎన్టీఆర్ తదుపరి మూవీని కన్నడ సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మొదలు పెట్టారు. గత నెలలో పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రం అక్టోబర్ 21 నుంచి రెగ్యులర్ షూట్ కి వెళ్ళబోతున్నట్టుగా చెప్పి ఎన్టీఆర్ అందరికి సర్ ప్రైజ్ ఇచ్చారు. అయితే ప్రశాంత్ నీల్ NTR 31 ని అక్టోబర్ నుంచి పట్టాలెక్కించి ప్రస్తుతం తాను షూటింగ్ లో పాల్గొనడం లేదు అని ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు.
తాను ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్ పైకి జనవరిలో అడుగుపెడతాను అని, ఈలోపు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ లేని సన్నివేశాలను ఇతర నటులతో చిత్రీకరిస్తారని ఎన్టీఆర్ చెప్పారు. మరి ఎన్టీఆర్ దేవర తర్వాత హిందీ ప్రాజెక్ట్ వార్ 2 ఫినిష్ చెయ్యాల్సి ఉంది. అందుకే NTR 31 కోసం సమయాన్ని కేటాయించలేక జనవరి నుంచి అని చెబుతున్నారు. ఇక ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబో కి డ్రాగన్ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారు.