Advertisementt

యాంకర్ శ్యామలకు ఇచ్చిపడేసిన కిర్రాక్ ఆర్పీ

Fri 20th Sep 2024 01:55 PM
kirrak rp  యాంకర్ శ్యామలకు ఇచ్చిపడేసిన  కిర్రాక్ ఆర్పీ
Kirrak RP Shocking Comments On Anchor Shyamala యాంకర్ శ్యామలకు ఇచ్చిపడేసిన కిర్రాక్ ఆర్పీ
Advertisement
Ads by CJ

2024 ఎలక్షన్స్ ముందు యాక్టీవ్ గా వైసీపీ పార్టీ తరుపున ప్రచారం చేసిన శ్యామల హైలెట్ అయ్యేందుకు పవన్ కళ్యాణ్ పై, చంద్రబాబుపై ఇష్టం వచ్ఛినట్టుగా నోరు పారేసుకుంది. ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోయాక సైలెంట్ గా ఇంట్లో ఉన్న శ్యామలను తీసుకొచ్చి జగన్ అధికార ప్రతినిధిగా మార్చేశాడు. సీనియర్ పొలిటీషియన్స్ రోజా, జూపూడి ప్రభాకర్, భూమన కరుణాకర్ రెడ్డి తో పాటుగా శ్యామలను వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నియమించడం వైసీపీ పార్టీలోని చాలామందికి నచ్ఛలేదు. 

ఇక అలా అధికార ప్రతినిధి అయ్యిందో లేదో.. ఇలా చంద్రబాబు, లోకేష్ లను విమర్శించేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలు, కార్యకర్తలపై ప్రతీకార దాడులు జరిగాయి. చంద్రబాబు బాధితులకు జగన్ నష్టపరిహారం అందించారు. విజయవాడ వరద బాధితులను పరామర్శించడంతో పాటు కోటి ఆర్ధిక సాయం చెయ్యడమే కాదు నేటికీ నిత్యావసర వస్తువులను అందజేస్తున్నారు. 

2 ఎకరాలతో మొదలుపెట్టిన చంద్రబాబు నేడు 2 లక్షల కోట్ల స్థాయికి ఎలా ఎదిగారంటూ ఇష్టమొచ్చినట్టుగా నోరు పారేసుకుంది. 

మరి శ్యామలకు ఎంతమంది ఎన్ని కౌంటర్లు వేసినా కిర్రాక్ ఆర్పీ వేసిన కౌంటర్ మాత్రం నెట్టింట సంచలనంగా మారింది. శ్యామలకు జగన్ వైసీపీ అధికార ప్రతినిధి పదవిని ఇవ్వగానే ఆమె జగన్ దగ్గర మార్కులు కొట్టేయాలని సీఎం పై పడింది. పదవికి, డబ్బులకు అమ్ముడుపోయి చిల్లర శ్యామల దిగజారిపోయిందని అంటూ ఆర్పీ సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. 2014-19 మధ్య 72 శాతం పోలవరం పనులు పూర్తి చేసింది.. 1998లో సైబర్ టవర్స్ నిర్మించింది, విజన్ 2020తో హైదరాబాద్ సింగపూర్‌గా మార్చింది ఎవరు చంద్రబాబు కాదా .. అమ్మ శ్యామలా కాస్త కళ్ళు తెరువు అంటూ ఆర్పీ శ్యామలకు ఎడా పెడా ఇచ్చి పడేసాడు. 

Kirrak RP Shocking Comments On Anchor Shyamala:

Kirrak RP Sensational Comments on Anchor Shyamala

Tags:   KIRRAK RP
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ