బిగ్ బాస్ సీజన్ 8 మొత్తం ఓ సంత లా, చేపల మర్కెట్ లా తయారైంది. 14 మంది సభ్యులు హౌస్ లోకి అడుగుపెడితే.. ఇద్దరు ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి వెళ్లిపోయారు. మిగిలిన 12 మందిలో రెండు క్లాన్స్ హౌస్ లో పని చేస్తున్నాయి. అభయ్-నిఖిల్ క్లాన్ సభ్యులు టాస్క్ ల్లో పోటీ పడుతున్నారు.
వారు గేమ్ స్టార్ట్ అవ్వగానే వైల్డ్ గా రియాక్ట్ అవుతున్నారు. పృథ్వీ, నిఖిల్, నాగమణికంఠ, ప్రేరణ, విష్ణు ప్రియా, సీత వీళ్లంతా టాస్క్ లు గెలవాలనో, లేదంటే హైలెట్ అవ్వడానికో హౌస్ లో రచ్చ రచ్చ చేస్తున్నారు. ప్రభావతి 2.0 టాస్క్ రసవత్తరంగా కనిపించడం అటుంచి టాస్క్ మొత్తం బిగ్ బాస్ రూల్స్ ను అతిక్రమించి మరీ ఆడేయ్యడం అతిగా అనిపించింది.
ఇక హౌస్ మేట్స్ చాలామంది సోనియా గురించి మాట్లాడుతున్నారు. ఆమె కన్సర్న్ ఉంటే పృథ్వీ ని కంట్రోల్ చెయ్యాలి, ఆడు ఆడు అని రెచ్చగొట్టకూడదంటూ మాట్లాడుకుంటున్నారు. నాగమణికంఠ.. నిఖిల్ ఫ్రెండ్ షిప్ పై ఎమోషనల్ అయ్యాడు. ఈలోపు బిగ్ బాస్ హౌస్ మేట్స్ మొత్తాన్ని లాన్ లో నించోబెట్టి ఎడా పెడా క్లాస్ పీకేసాడు. అంతేకాదు హౌస్ మేట్స్ కి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.
ఈ సీజన్ లో క్లాన్స్ అనేది అతి ముఖ్యమైన భాగం. ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ బిగ్ బాస్ రూల్స్ మాత్రమే చెల్లుబాటు అవుతాయి. మీలో ఎవరైనా బిగ్ బాస్ కంటే ఎక్కువ అని భావిస్తే ఇప్పుడే వెళ్లిపోవచ్చు అంటూ గేట్స్ ఓపెన్ చేసేసరికి హౌస్ మేట్స్ అందరూ షాకయ్యిన ప్రొమో వైరల్ అయ్యింది.