అందరి కళ్ళు దేవర పైనే.. కల్కి తర్వాత రాబోతున్న పెద్ద పాన్ ఇండియా చిత్రం దేవర 1. ఇంకో వారం రోజుల్లో అంటే సెప్టెంబర్ 27 న ఆడియన్స్ ముందుకు రాబోతున్న దేవర చిత్రం పై ట్రేడ్ లోను, ప్రేక్షకుల్లోనూ భీభత్సమైన అంచనాలున్నాయి. వరస ప్రమోషన్స్ తో ఎన్టీఆర్ దేవర పై అంచనాలు పెంచుకుంటూ వస్తున్నారు.
హిందీ, తమిళ ప్రమోషన్స్ తో సోషల్ మీడియాలో దేవర హావా బాగా పెరిగింది. ఇక హైదరాబాద్ లో ఎన్టీఆర్ కుర్ర హీరోలైన సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ లతో ఇంటర్వ్యూ చెయ్యడం అభిమానులను ఇంప్రెస్స్ చేసింది. ఇక ఆదివారం హైదరాబాద్ లో జరగబోయే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరుకాబోయే గెస్ట్ లపై అందరిలో ఎంతో ఉత్సుకత నడుస్తుంది.
ముందు నుంచి మహేష్ దేవర ఈవెంట్ గెస్ట్ అంటూ ప్రచారం జరిగినా ఇప్పుడు మాత్రం ముగ్గురు టాప్ డైరెక్టర్స్ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హజరవుతారని తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ దర్శకుడు రాజమౌళి, అరవింద సమెత తో ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేసిన త్రివిక్రమ్, ప్రస్తుతం ఎన్టీఆర్ తో మాస్ మూవీ మొదలు పెట్టిన కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ లు దేవర ఈవెంట్ కి అతిధులుగా హాజరుకాబోతున్నారట. మరి ఆ ముగ్గురు టాప్ డైరెక్టర్ ఎన్టీఆర్ పక్కన నిలిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు.