బిగ్ బాస్ సీజన్ 8 లో ఏం జరుగుతుంది. బుల్లితెర ఆడియన్స్ కి ఏం కావాలో అది ఇవ్వకుండా అంటే ఎంటెర్టైమెంట్ ఇవ్వకుండా చేపల మర్కెట్ మాదిరి బిగ్ బాస్ హౌస్ ని హౌస్ మేట్స్ తయారు చేస్తుంటే బిగ్ బాస్ కూడా చోద్యం చూస్తున్నాడు కానీ.. ఎలాంటి మార్పులు చెయ్యకుండా, వీకెండ్ నాగార్జున క్లాస్ తీసుకునే వరకు వదిలెయ్యడం పై బుల్లితెర ప్రేక్షకులు రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఇక పతివ్రత శిరోమమణిలా పవిత్రమైన కబుర్లు చెప్పే సోనియా ని నెటిజెన్స్ మాములుగా ఆడుకోవడం లేదు. విష్ణు ప్రియా నిఖిల్ తో ఫ్రెండ్ షిప్ ఎలా సెట్ అయ్యింది అని సరదాగా అడిగిన ప్రశ్నకు సోనియా చేసిన రచ్చ ఎలా ఉందొ, ఆ తర్వాత నాగార్జున సోనియా ని ఎలా వార్న్ చేసారో అందరూ చూసారు. నామినేషన్స్ లో యష్మి డైరెక్ట్ గానే సోనియా నిఖిల్, పృథ్వీ, అభయ్ లపై పెట్టిన శ్రద్ద గేమ్ పై పెట్టలేదు అంటూ ఘాటుగా కామెంట్స్ చేసింది.
ఇక ఇప్పుడు నిఖిల్ తోనూ, పృథ్వీ తోనూ సోనియా హద్దులు దాటి ప్రవర్తించడం బుల్లితెర ప్రేక్షకులకు నచ్చలేదు. చెప్పేవన్నీ పతివ్రత మాటలు దూరేదేమో ఏదో అన్నట్టుగా సోనియా ప్రవర్తనపై కామెట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా నిఖిల్ దగ్గర కూర్చుని అతనిని అసభ్యంగా తాకడం చూసిన బుల్లితెర ప్రేక్షకులు ఛీ.. ఛీ సోనియా అంటూ కామెంట్స్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.