దేవర తమిళ ప్రెస్ మీట్లో వెట్రిమారన్ తో సినిమా చెయ్యాలంటూ తన కోరికను బయటపెట్టడమే కాదు.. సర్ నాతో సినిమా చెయ్యండి అని వెట్రిమారన్ నే రిక్వెస్ట్ చేసిన యంగ్ టైగర్ ఇప్పుడు మరో తమిళ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు రెడీ గా వున్నట్లుగా చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. దేవర ప్రమోషన్స్ లో భాగంగా తమిళనాట ఎన్టీఆర్ ప్రెస్ మీట్, ఇంటర్వూస్ తో హడావిడి చేసాడు.
సెప్టెంబర్ 27న విడుదల కాబోతున్న తరుణంలో దేవర సినిమాను మూవీ టీమ్ బాగా ప్రమోట్ చేస్తుంది. తాజాగా ఎన్టీఆర్ కోలీవుడ్ టాప్ డైరెక్టర్ అట్లీతోనూ ఫ్యూచర్ లో ఓ సినిమా ఉంటుందని స్వయంగా ప్రకటించారు. ఇంతకుముందు అట్లీతో ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన చర్చలు జరిగాయి.
కానీ ఇద్దరికీ వేరువేరు కమిట్‌మెంట్స్ ఉన్న కారణంగా అప్పట్లో అది కార్యరూపం దాల్చలేదంటూ ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చాడు. మరి అట్లీ తో ఎన్టీఆర్ అంటే ఇప్పట్లో అవుతుందా, ఎందుకంటే ఎన్టీఆర్ కు చాలా కమిట్ మెంట్స్ ఉన్నాయి. ప్రస్తుతం చేస్తున్న దేవర కు పార్ట్ 2 ఉంది, అలాగే ప్రశాంత్ నీల్ తో మరో మూవీ మొదలు పెట్టాడు. ఇంకా హిందీ ప్రాజెక్ట్ వార్ 2 లో కీలకపాత్రలో కనిపించబోతున్నాడు. అటు జవాన్ తర్వాత అట్లీ నెక్స్ట్ మూవీపై చాలా సస్పెన్స్ నడుస్తుంది.