జానీ మాస్టర్ ని ఈరోజు ఉదయం SOT పోలీసులు గోవా లో అరెస్ట్ చేసారు. గత నాలుగు రోజులుగా పోలీసులుకు దొరక్కుండా తప్పించుకుతిరుగుతున్న జానీ ని మూడు పోలీస్ బృందాలు వెతుకులాటలో భాగంగా అతను గోవాలో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేసారు. అయితే గోవా నుంచి SOT పోలీసులు జానీ ని హైదరాబాద్ కి తీసుకొస్తున్నారని చెప్పారు.
కానీ SOT పోలీసులు జానీ మాస్టర్ ని గోవా లో అరెస్ట్ చేసినట్లుగా చెప్పడమే కాదు, జానీ మాస్టర్‌ను గోవా కోర్టులో హాజరుపరిచామని, పీటీ వారెంట్‌పై ఆయనను తరలించామన్నారు. జానీ ని రేపు ఉదయం ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరుస్తామని, జానీ పై పోక్సో కేసుతో పాటు అత్యాచార కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అంతేకాదు బాధితురాలి స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డ్ చేసినట్లు తెలిపారు.
జానీ మాస్టర్ పై అభియోగం చేసిన లేడీ కొరియోగ్రాఫర్ తన లైఫ్ లోకి జానీ ఎలా వచ్చాడు, తన పట్ల అతను ఎలా ప్రవర్తించాడో అని చెప్పింది. 2019లో జానీ మాస్టర్ గ్రూప్‌లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరిన తను ఓ సినిమా చిత్రీకరణ కోసం ముంబైకి వెళ్లినప్పుడు అక్కడ హోటల్లో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్కొంది. ఈ విషయం ఎవరికైనా చెబితే గ్రూప్ నుంచి తొలగిస్తానని, తనను దాటి వెళితే పరిశ్రమలో పని చేయలేవని బెదిరించాడని తెలిపింది.