టాలీవుడ్ లో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదం కలకలం సృష్టిస్తుంది. జానీ మాస్టర్ తన దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన లేడీ కొరియోగ్రాఫర్ ని శారీరకంగా, మానసికంగా వేధించిన కేసులో పోలీసులు పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసారు. దానితో జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంది.
జానీ మాస్టర్ కేసు విషయంలో చాలామంది నటీమణులు బాధితురాలు వైపు నిలుస్తూ తమ వాదన వినిపిస్తున్నారు. ఓ అజ్ఞాత హీరో (అల్లు అర్జున్) బాధిత మహిళకు తన సినిమాల్లో అవకాశం ఇస్తాను అని అభయమిచ్చినట్టుగా చెబుతున్నారు.
ప్రస్తుతం జానీ మాస్టర్ తో పని చేసిన స్టార్ హీరోలెవరూ ఈ కేసుపై మాట్లాడేందుకు సిద్ధంగా లేరు. కానీ తాజాగా జానీ మాస్టర్ కేసు విషయంలో ఓ హీరో స్పందించడం హాట్ టాపిక్ గా మారింది. ఆ హీరో ఎవరో కాదు మంచు మనోజ్.. మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.
ఈ స్థాయికి రావడానికి జానీ మాస్టర్ ఎంతగా కష్టపడ్డారో నేది అందరికీ తెలుసు. జానీ పై ఆరోపణలు రావడం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. ఈ కేసులో అసలు తప్పు ఎవరిది అనేది చట్టం నిర్ణయిస్తుంది. ఒక అమ్మాయి ఆరోపణలు చేసినప్పుడు పారిపోవడం భావి తరాలకు తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్లం అవుతాం.
ఈ కేసులో త్వరగా స్పందించిన హైదరాబాద్ పోలీసులను ప్రత్యేక కృతజ్ఞతలు. మాస్టర్ మీరు తప్పు చేయకపోతే పోరాడండి.. దోషి అయితే వెంటనే లొంగిపోండి అంటూ మంచు మనోజ్ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.