బిగ్ బాస్ సీజన్ 8 మొదలై మూడు వారాలు గడుస్తుంది. గత రెండు వారాల్లో హౌస్ లో ఉన్న 14 మంది కంటెస్టెంట్స్ లో ఓ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. బెజవాడ బేబక్క, శేఖర్ భాషాలు ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి వెళ్లిపోయారు. మిగిలిన 12మందిలో టాస్క్ ల కోసం రచ్చ, ఫుడ్ కోసం పాట్లు, నామినేషన్స్ లో గొడవలు కలిపి హౌస్ మొత్తం చేపల మర్కెట్ మాదిరి తయారైంది.
ఇక బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ మొత్తం తీసుకుని వాటిని తిరిగి పొందడం కోసం కష్టపడి టాస్క్ ఆడాల్సిందే. నిఖిల్ క్లాన్ సభ్యులు, అభయ్ క్లాన్ సభ్యులు ఫుడ్ కోసం తెగ ఆడేస్తున్నారు. గత రాత్రి నిఖిల్ టీం టాస్క్ లు గెలిచి రేషన్ గెలుచుకున్నారు. దానితో అభయ్ టీమ్ డిజ్ పాయింట్ అయ్యింది. ఆతర్వాత ప్రభావతి 2.0 లో కూడా నికిల్ టీమ్ గెలవడంతో వారికే రేషన్ ఎక్కువ వెళ్ళింది.
ఇక బిగ్ బాస్ వంట చేసుకునేందుకు స్టవ్ ఇచ్చి వారానికి 14 గంటలు మాత్రమే హౌస్ మేట్స్ వండుకోవడానికి కండిషన్ పెట్టారు.
దానితో రెండు టీమ్స్ గంట కొట్టి గబగబా వండేసుకుని టైమ్ సేవ్ చేసుకున్నారు. కానీ ఈరోజు బిగ్ బాస్ ఒక టైమ్ లో ఒకే టీం వంట చేసుకోవాలి, ఆతర్వాత మరో టీమ్ వండుకోవాలని, వంట చేసే సమయంలో కేవలం ముగ్గురు మాత్రమే కిచెన్ లో ఉండాలనే కండిషన్ పెట్టగానే అసలు మనిషి పుట్టుక పుట్టిండా బిగ్ బాస్ పస్తు పడుకోబెట్టడానికి టాస్క్ ఇస్తున్నాడా, దమ్మక్ ఉందా అసలు తినడానికి టాస్క్ లు పెడుతున్నారా లేదంటే తినకుండా ఉండడానికి టాస్క్ లు పెడుతున్నారా అంటూ అభయ్ బిగ్ బాస్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసాడు.