Advertisementt

ప్రభాస్ - హను మూవీ క్రేజీ అప్ డేట్

Thu 19th Sep 2024 04:11 PM
prabhas   ప్రభాస్ - హను మూవీ క్రేజీ అప్ డేట్
Prabhas - Hanu Movie Crazy Update ప్రభాస్ - హను మూవీ క్రేజీ అప్ డేట్
Advertisement
Ads by CJ

ప్రభాస్ అసలు గ్యాప్ ఇవ్వడం లేదు. కల్కి తర్వాత ఇటలీ వెకేషన్ కి వెళ్లొచ్చిన ఆయన ఆ అర్వాత మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ షూటింగ్ ని ఫినిష్ చేసే హడావిడిలో ఉన్నాడు. ప్రభాస్ స్పీడు చూసి ఆయన అభిమానులు నేల మీద నడవట్లేదు. ప్రభాస్ మునుపెన్నడూ లేని స్పీడు ను, జోష్ ను షూటింగ్స్ లో చూపిస్తున్నాడు. 

అంతేకాదు ఇప్పుడు సైలెంట్ గా ప్రభాస్ హను రాఘవపూడి రెగ్యులర్ షూటింగ్ లో మొదలవడం మరింత షాకిచ్చే విషయం. ఆగష్టు లో ప్రభాస్-హను రాఘవపూడి కాంబోలో పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రానికి ఫౌజీ అనే టైటిల్ ని అనుకుంటున్నారు. 1945 నేప‌థ్యంలో సాగే క‌థతో ఫౌజీ తెరకెక్కుతుంది. 

ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా ఇమాన్వీ నటిస్తుంది. మిదున్ చక్రవర్తి ప్రభాస్ కు తండ్రి పాత్రలో కనిపించబోతున్నారు. హను రాఘవపూడి లు ఎలాంటి సౌండ్ లేకుండా బుధ‌వారం నుంచే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొదలు పెట్టేసారు. ప్రస్తుతం మ‌ధురైలో కొన్ని కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌భాస్ మాత్రం ఫౌజీ సెట్‌లో లేడు. 

ఆయ‌న హైదరాబాద్ లో రాజాసాబ్ షూటింగ్ లో ఉన్నాడు. రాజాసాబ్‌ షెడ్యూల్ పూర్తయ్యాకే ప్ర‌భాస్ హ‌ను సినిమా సెట్లోకి అడుగు పెడ‌తాడని తెలుస్తుంది. మ‌ధురై షెడ్యూల్ లో ప్ర‌భాస్ పై తెర‌కెక్కించే స‌న్నివేశాలేం లేవ‌ని స‌మాచారం. ఒక వారం రోజుల పాటు ఫౌజీ చిత్ర‌బృందం మ‌ధురైలోనే ఉంటుంది అని సమాచారం. 

Prabhas - Hanu Movie Crazy Update:

Crazy Update on Prabhas - Hanu Movie 

Tags:   PRABHAS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ