Advertisementt

లైన్ లో పడిన పుష్ప 2

Thu 19th Sep 2024 10:29 AM
pushpa the rule  లైన్ లో పడిన పుష్ప 2
Pushpa 2 shooting update లైన్ లో పడిన పుష్ప 2
Advertisement
Ads by CJ

పుష్ప ద రూల్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో డిసెంబర్ 6 టార్గెట్ గా చక చకా ఫినిష్ అవుతుంది. ఇప్పటికే దర్శకుడు సుకుమార్ క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తి చేసేసారు. అల్లు అర్జున్ కూడా త్వరగా పుష్ప 2 షూటింగ్ ఫినిష్ చెయ్యాలనే కసితో పని చేస్తున్నారు. ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే అక్టోబర్ కల్లా షూటింగ్ పూర్తి చెయ్యాలని సుక్కు-బన్నీ కష్టపడి పని చేస్తున్నారు. 

అక్టోబర్ లో పుష్ప ద రూల్ షూటింగ్ ఫినిష్ చేస్తే నవంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ తో పాటుగా సుకుమార్ సినిమా ప్రమోషన్స్ తోనూ చాలా బిజీగా కనిపిస్తారని తెలుస్తుంది. సుకుమార్ కూడా ఇటు షూటింగ్ ఫినిష్ చేస్తూనే మధ్యలో పోస్ట్ ప్రొడక్షన్ పనులను చక్కబెట్టాలని చూస్తున్నారట. డిసెంబర్ 6 న ఎలాంటి టెన్షన్ లేకుండా పుష్ప 2 ని బాక్సాఫీసు దగ్గర దించేందుకు మేకర్స్ ప్లాన్స్ సిద్ధం చేసుకుంటున్నారట. 

రష్మిక, ఫాహద్ ఫాసిల్ ఇలా సినిమాలోని కీలక నటులంతా షూటింగ్ ఫినిష్ అయ్యేవరకు సుకుమార్ కు అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నారని తెలుస్తుంది. ఇదంతా చూస్తుంటే పుష్ప 2 షూటింగ్ లైన్ లో ఉన్నట్లుగానే కనిపిస్తుంది. 

Pushpa 2 shooting update:

Pushpa The Rule shooting update

Tags:   PUSHPA THE RULE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ