Advertisementt

కరీనా కపూర్ సౌత్ ఎంట్రీ ఖాయమే

Wed 18th Sep 2024 10:11 PM
kareena kapoor  కరీనా కపూర్ సౌత్ ఎంట్రీ ఖాయమే
Kareena Kapoor South Industry Entry Confirmed కరీనా కపూర్ సౌత్ ఎంట్రీ ఖాయమే
Advertisement
Ads by CJ

బాలీవుడ్ బెబో కరీనా కపూర్ సౌత్ ఎంట్రీ ఖాయమైంది. కరీనా కపూర్ అసలైతే యష్ టాక్సిక్ మూవీ తోనే సౌత్ లోకి రావాల్సి ఉన్నప్పటికీ.. ఆ ప్రాజెక్ట్ నుంచి కరీనా తప్పుకుంది. ఆమె ప్లేస్ లోకి నయనతార వచ్చి చేరింది. ఇక సందీప్ వంగా - ప్రభాస్ కాంబోలో మొదలు కాబోయే స్పిరిట్ మూవీలో కరీనా కపూర్ ని హీరోయిన్ గా అనుకుంటున్నారనే న్యూస్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. 

ఈ ఏడాది చివరిలో మొదలు కాబోయే స్పిరిట్ మూవీలో ప్రభాస్ కి జోడిగా కరీనా కపూర్ ని హీరోయిన్ గా ఫైనల్ చెయ్యడమే కాదు, ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం కరీనా కపూర్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది అని చెప్పుకుంటున్నారు. ఇది మాత్రమే కాదు. రాజమౌళి-మహేష్ కాంబో మూవీకి కూడా హీరోయిన్ గా కరీనా పేరు వినిపిస్తోంది. 

రాజమౌళి మహేష్ కి జోడిగా కరీనా కపూర్ పేరుని పరిశీలుస్తున్నట్టుగా గుసగుసలు వినిపిస్తన్నాయి. మరి ఎలా లేదన్నా ఈ ఏడాది కరీనా కపూర్ సౌత్ ఎంట్రీ ఖాయమైనట్టే కనిపిస్తుంది. ఈ రెండు ప్రాజెక్ట్స్ లో ఏది నిజమైనా కరీనా అభిమానులు సంబరాలు చేసుకుంటారు. 

Kareena Kapoor South Industry Entry Confirmed:

Prabhas likely to romance Kareena Kapoor 

Tags:   KAREENA KAPOOR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ